గుడిలోకెళ్లి మరీ కొట్టారు.. యువకుల దాడిలో పూజారి మృతి

sivanagaprasad kodati |  
Published : Nov 01, 2018, 01:36 PM IST
గుడిలోకెళ్లి మరీ కొట్టారు.. యువకుల దాడిలో పూజారి మృతి

సారాంశం

ఒక వర్గానికి చెందిన నలుగురు యువకులు ఆలయంలోకి వచ్చారు. వస్తూనే తమ ప్రార్థనకు ఆటంకం కలిగించేలా మైక్ ఎందుకు పెడుతున్నావంటూ వాగ్వివాదానికి దిగి.. అనంతరం సత్యనారాయణను చితకబాదారు. 

వరంగల్ జిల్లాలో నలుగురు యువకులు పూజారిపై దాడి చేయడంతో అతను మరణించాడు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని పోచం మైదానం వద్ద వున్న శివసాయి బాబా ఆలయంలో గత శనివారం పూజారి దేవల సత్యనారాయణ అనే వృద్ధ పూజారి పూజలు చేస్తున్నారు. 

అయితే ఈ సమయంలో ఒక వర్గానికి చెందిన నలుగురు యువకులు ఆలయంలోకి వచ్చారు. వస్తూనే తమ ప్రార్థనకు ఆటంకం కలిగించేలా మైక్ ఎందుకు పెడుతున్నావంటూ వాగ్వివాదానికి దిగి.. అనంతరం సత్యనారాయణను చితకబాదారు. 

వారి దెబ్బలకు ఆయన తీవ్రంగా గాయపడటంతో భక్తులు ఎంజీఎంకు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం బుధవారం నిమ్స్‌లో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ సత్యనారాయణ కన్నుమూశారు. పూజారి మరణించిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు భారీగా మోహరించారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : చలి నుండి ఉపశమనం మూన్నాళ్ల ముచ్చటే.. మళ్లీ గజగజలాడించే చలి, పొగమంచు ఎక్స్ట్రా
Bullet Train India: దూసుకొస్తున్న బుల్లెట్ ట్రైన్.. హైదరాబాద్, అమరావతి రూట్లలో గంటలో ప్రయాణం