మోచేతికి ఆపరేషన్.. అనస్థీషియా ఎక్కువై రోగి...

By ramya neerukondaFirst Published Nov 1, 2018, 1:03 PM IST
Highlights

ఆపరేషన్ చేసిన వైద్యులు.. అర్థరాత్రి సమయంలో అతని పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్ తరలించాలని చెప్పారు. కాగా.. అక్కడికి వెళ్లాక.. రాజశేఖర్ మృత్యువాతపడ్డాడు.
 

అనస్థీషియా మోతాదు ఎక్కవ అవడంతో.. ఓ రోగి ప్రాణాలు కోల్పోయిన సంఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణానికి చెందిన రాజశేఖర్ అనే యువకుడి మోచేతికి కొద్ది రోజుల క్రితం ప్రమాదవశాత్తు గాయమైంది. కాగా.. సేవాలాల్ ఆర్థో ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరాడు.

కాగా.. అతని మోచేతికి ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. దీంతో... చిన్న ఆపరేషనే కదా అని అతని కుటుంబసభ్యులు భావించారు. అయితే.. ఆపరేషన్ చేసిన వైద్యులు.. అర్థరాత్రి సమయంలో అతని పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్ తరలించాలని చెప్పారు. కాగా.. అక్కడికి వెళ్లాక.. రాజశేఖర్ మృత్యువాతపడ్డాడు.

అయితే.. ఎనస్థీషియా ఎక్కువ మోతాదులో ఇవ్వడం కారణంగానే అతను మృతిచెందినట్లు తెలిసింది. బంధువులు ఆందోళన చేస్తారేమోనని ముందుగానే భావించిన ఆస్పత్రి యాజమాన్యం.. ముందుగానే పోలీసులకు సమాచారం అందించారు. కాగా.. తమకు న్యాయం చేయాలంటూ మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. 

click me!