మందుల కొనుగోలు స్కాం: తెలంగాణ ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి మరోసారి అరెస్ట్

By narsimha lodeFirst Published Sep 4, 2020, 1:07 PM IST
Highlights

ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణిని ఏసీబీ అధికారులు శుక్రవారం నాడు మరోసారి అరెస్ట్ చేశారు.ఈఎస్ఐ స్కాంలో గతంలోనే దేవికారాణి అరెస్టైంది. ఇటీవలనే బెయిల్ ఆమె విడుదలైంది. 


హైదరాబాద్: ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణిని ఏసీబీ అధికారులు శుక్రవారం నాడు మరోసారి అరెస్ట్ చేశారు.ఈఎస్ఐ స్కాంలో గతంలోనే దేవికారాణి అరెస్టైంది. ఇటీవలనే బెయిల్ ఆమె విడుదలైంది. 

అధిక ధరలకు మందుల కొనుగోలు వ్యవహరంలో దేవికారాణితో మరో ఎనిమిది మందిపై ఏసీబీ కేసు నమోదు చేసింది.మందుల కొనుగోలు రూ.6.7 కోట్లు అక్రమాలు చోటు చేసుకొన్నాయని ఏసీబీ గుర్తించింది. ఈ కేసులో దేవికారాణిని ఏసీబీ అధికారులు ఇవాళ అరెస్ట్ చేశారు.

also read:తెలంగాణ ఈఎస్ఐ స్కాంలో మరో ట్విస్ట్: దేవికారాణి రూ. 10 కోట్ల బంగారు ఆభరణాలు మాయం

గతంలో చోటు చేసుకొన్న కేసులో దేవికారాణితో పాటు పలువురిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అదే కేసులో విచారణ చేస్తున్న సమయంలోనే ఈ విషయం వెలుగు చూసింది.దేవికారాణితో పాటు పద్మ, వసంత, ఇందిరా, కంచర్ల సుజాత, కుక్కల కృష్ణసాగర్ రెడ్డి, బండి వెంకటేశ్వర్లు, చెరుకూరి నాగరాజు, తింకశల వెంకటేశ్ లను ఏసీబీ శుక్రవారం నాడు అరెస్ట్ చేసింది.

దేవికారాణికి చెందిన రూ. 10 కోట్ల ఆభరణాలను మాయం చేసినట్టుగా ఏసీబీ అధికారులు గుుర్తించారు. అక్రమంగా దేవికారాణి ఆస్తులు సంపాదించినట్టుగా గుర్తించారు. మరో వైపు ఇతర రాష్ట్రాల్లో కూడ దేవికాారాణి పెట్టుబడులు పెట్టారని ఏసీబీ అనుమానిస్తోంది.

click me!