భద్రాచలంలో బెంగళూరువాసి దారుణ హత్య

Published : Dec 20, 2019, 10:07 AM IST
భద్రాచలంలో బెంగళూరువాసి దారుణ హత్య

సారాంశం

కర్ణాటక రాష్ట్రంలోని నార్త్‌ బెంగుళూరు కుండలహల్లి గేట్‌ సమీపంలోని గుల్మోహర్‌ ఎన్‌క్లేవ్‌ రోడ్డులో ఉన్న 301 ఎఎన్‌ఎ్‌స హోమ్స్‌లో అతడు నివాసం ఉంటున్నట్లు గుర్తించారు.

బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి... భద్రాచలంలో దారుణ హత్యకు గురయ్యాడు.  భద్రాచంలోని గోదావరి నదీ తీరంలో ఆయన మృతదేహం స్థానికంగా కలకలం రేపింది. మంగళవారం రాత్రి గోదావరి తీరంలో అతనిని గుర్తు తెలియిని వ్యక్తులు ఎవరో హత్య చేశారు.

ఈ క్రమంలో భద్రాచలం పోలీసులు మృతుడి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించగా ఫలితం లేకపోవడంతో ఆధార్‌ వేలిముద్ర నమోదుతో హత్యకు గురైన వ్యక్తి వివరాలు సేకరించారు. ఆ వివరాల ప్రకారం అతడి పేరు అశ్వత్థామయ్యగా గుర్తించారు.
 
కర్ణాటక రాష్ట్రంలోని నార్త్‌ బెంగుళూరు కుండలహల్లి గేట్‌ సమీపంలోని గుల్మోహర్‌ ఎన్‌క్లేవ్‌ రోడ్డులో ఉన్న 301 ఎఎన్‌ఎ్‌స హోమ్స్‌లో అతడు నివాసం ఉంటున్నట్లు గుర్తించారు. దీంతో అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై భద్రాచలం సీఐ వినోద్‌రెడ్డి కేసు నమోదు చే సి దర్యాప్తు చేస్తున్నారు. 

దేశంలోని వివిధ పు ణ్యక్షేత్రాలను సందర్శించే అలవాటు ఉన్న అశ్వత్థామయ్య ఈ క్రమంలోనే భద్రాచలం వచ్చినట్లు తెలుస్తోంది. అయితే అతడిని ఎ వరు హత్య చేశారు. ఎందుకు చేశారనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Viral Video : చేతిలో టీ గ్లాస్ పట్టుకుని పగలబడి నవ్వే... ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
IRCTC: బిజీ లైఫ్‌కి కాస్త బ్రేక్ ఇవ్వండి బాస్‌.. త‌క్కువ ధ‌ర‌లో థాయ్‌లాండ్ టూర్‌, లైఫ్ టైమ్ మెమోరీస్ ఖాయం