Agnipath protest in Secunderabad పక్కా ప్లాన్: వాట్సాప్ గ్రూప్‌ల్లో నిరసనలపై పథకం

Published : Jun 17, 2022, 02:16 PM IST
Agnipath protest in Secunderabad పక్కా ప్లాన్:  వాట్సాప్ గ్రూప్‌ల్లో నిరసనలపై పథకం

సారాంశం

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆందోళన చేసేందుకు వాట్సాప్ గ్రూప్ లను ఆందోళనకారులు క్రియేట్ చేసుకున్నారు. ఈ వాట్సాప్ గ్రూపుల్లో నిరసనకు సంబంధించి ప్లాన్ చేశారు.  ఇవాళ ఉదయమే ఆందోళనకారులు ఒక్కసాారిగా మెట్రో రైల్వేస్టేషన్లకు చేరుకుని ఆందోళన నిర్వహించారు.

హైదరాబాద్: రెండు రోజుల క్రితమే Secunderabad Railway Station లో ఆందోళన చేయాలని Army అభ్యర్ధులు ప్లాన్ చేశారు. ఈ మేరకు Whats APP  గ్రూప్ లు క్రియేట్ చేశారు.  ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా అభ్యర్ధులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో Trains నిలిపి నిరసనకు దిగాలని ప్లాన్ చేశారు. రెండు వాట్సాప్ గ్రూప్ ల ద్వారా ఆందోళన చేసే విషయమై ప్లాన్ చేశారు. ఈ నెల 15వ తేదీనOnly Warangal District  పేరుతో Group  క్రియేట్ చేశారు. మరో గ్రూప్ ను కూడా క్రియేట్ చేసిన విషయాన్ని పోలీసులు గుర్తించారు. 

రెండు గంటల వ్యవధిలోనే రెండు వాట్సాప్ గ్రూప్ లు క్రియేట్ చేశారు. ఆదివారం నుండి ఆందోళనల కోసం ప్లాన్ చేస్తున్నారు. నిన్న రాత్రే సుమారు 500 మంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకున్నారని తెలుస్తుంది. ఇవాళ ఉదయం తొమ్మిది గంటలకు ఆర్మీ అభ్యర్ధులు సికింద్రాబాద్ రైల్వే స్టేసన్ కు చేరుకొని నిరసనకు దిగారు. రైలు పట్టాలపై నిలబడి రైళ్ల రాకపోకలకు అంతరాయం కల్గించారు. పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జీకి దిగారు. దీంతో ఆందోళనకారులు రెచ్చిపోయారు. రైల్వే స్టేసన్ లో విధ్వంసానికి దిగారు. ఈ వాట్సాప్ గ్రూపులు ఎవరు క్రియేట్ చేశారు. ఈ గ్రూపుల్లో ఎవరేవరు ఏం చాటింగ్ చేశారనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో శుక్రవారం నాడు ఉద్రిక్తత చోటు చేసుకొంది. రైల్వేస్టేషన్‌లోకి చొచ్చుకెళ్లిన ఆర్మీ ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న అభ్యర్ధులు  రైళ్లపై రాళ్లు రువ్వారు. రైళ్లలో ఉన్న ప్రయాణీకులు  భయంతో పరుగులు తీశారు. రైల్వే  పట్టాలపై కూర్చుని   ఆందోళనకు దిగారు. రైలు పట్టాలపై నిప్పు పెట్టి ఆందోళనకు దిగారు.   రైలు పట్టాలపై కూర్చొని ఆందోళనకారులు ఆందోళన చేస్తుండడంతో రైళ్లను నిలిపివేశారు అధికారులు. మరో వైపు  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బయట ఉన్న RTC బస్సులపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని 1,2,3 4,5,ఫ్లాట్ ఫారాలపైకి చేరుకొన్న వందలాది మంది ఆర్మీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్ధులు   ఆందోళనకు దిగారు. రైల్వే స్టేషన్ లో నిలిచి ఉన్న రైళ్లపై రాళ్లతో దాడికి దిగారు. రైలు పట్టాల మధ్య చెత్త వేసి నిప్పు పెట్టారు.  వందలాది మంది  రైలు పట్టాలపై ఆందోళనకు దిగారు. 

also read:Agnipath protest in Secunderabad ఇంటలిజైన్స్ వైఫల్యంతోనే సికింద్రాబాద్ లో విధ్వంసం: బండి సంజయ్

అగ్నిపథ్ ను రద్దు చేసి గతంలో మాదిరిగా ఆర్మీలో రిక్రూట్ మెంట్  చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు రైల్వేస్టేషన్ లో నిలిపి ఉన్న రైళ్లను ఆందోళనకారులు దగ్ధం చేశారు. రైల్వేస్టేషన్ లోని స్టాల్స్ ను కూడా ధ్వంసం చేశారు. ప్యాసింజర్ రైళ్లతో పాటు,ఆందోళనకారులు దగ్ధం చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోని 1,2,3 ఫ్లాట్‌ఫారాల్లో   రణరంగా పరిస్థితి మారింది. రైళ్లకు అంటుకున్న మంటలను ఆర్పివేసేందుకు వచ్చిన  ఫైరింజన్లపై కూడా  ఆందోళనకారులు అడ్డుకున్నారు.

ఆర్మీ పరీక్షలకు సిద్దమౌతున్న అభ్యర్ధులు ఒక్కసారిగా  రైల్వే స్టేషన్ లోకి వచ్చి విధ్వంసానికి పాల్పడ్డారు. రైలు పట్టాల మధ్యలో బైక్ లు వేశారు.  ఆందోళనకారులు రైళ్లలోకి చేరుకొని రైళ్లపై దాడికి దిగారు. రైళ్లతో పాటు, ఫ్లాట్ పారాలపై ఉన్న ప్రయాణీకులు భయంతో పరుగులు తీశారు. రెండు గంటలకు పైగా ఆందోళనకారులు  రైల్వేస్టేషన్లో విధ్వంసానికి పాల్పడ్డారు. 

రైల్వేస్టేషన్ లోని  పార్శిల్  కార్యాలయంపై ఆందోళనకారులు దాడి చేశారు. పార్శిల్ కార్యాలయంలోని పార్శిళ్లను పట్టాలపై వేసి నిప్పు పెట్టారు. పోలీసులపై కూడా ఆందోళనకారులు దాడికి దిగారు. రైల్వే స్టేషన్ లోని సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేశారు.సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి వందలాది మంది ప్రయాణీకులు దేశంలోని పలు ప్రాంతాలకు వెళ్తుంటారు. ఇవాళ ఉదయం ఆందోళనకారులు రైల్వే స్టేసన్ లో విధ్వంసానికి పాల్పడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ  విధ్వంసానికి పాల్పడ్డారు. సీఆర్‌పీఎఫ్, ఎస్పీఎఫ్, తెలంగాణ పోలీస్ , రైల్వే పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.  రైల్వేస్టేషన్ లోని 10 ఫ్లాట్ ఫారాలున్నాయి. 2,3,4,5 ఫ్లాట్ పారాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 

తెలంగాణ వ్యాప్తంగా సుమారు రెండు వేలకు పైగా అభ్యర్ధులు ఆర్మీ పరీక్ష కోసం ఎదురు చూస్తున్నారు. ఆర్మీలో ఉద్యోగాల కోసం నిర్వహించిన అన్ని విభాగాల్లో ఈ అభ్యర్ధులు ఎంపికయ్యారు. ఆర్మీ పరీక్ష నిర్వహిస్తే తమకు ఉద్యోగాలు వస్తాయని వారు చెబుతున్నారు. అయితే ఈ తరుణంలో ఆర్మీ పరీక్ష నిర్వహించకుండా అగ్నిపథ్ ను తీసుకురావడంతో తాము తీవ్రంగా నష్టపోయే పరిస్థితి నెలకొందని ఆందోళనకారులు చెబుతున్నారు. రెండేళ్లుగా పరీక్షలు నిర్వహించలేదన్నారు. 

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వందలాది మంది యువకులు రాళ్లు రువ్వుతూ ఆందోళన  కొనసాగిస్తున్నారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు  గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కొందరు ఆందోళనకారులు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఆందోళనకారులను  రైల్వే స్టేషన్ నుండి పంపించేందుకు గాను పోలీసులు కాల్పులకు దిగారు. సుమారు 10 రౌండ్లు పోలీసులు కాల్పులు జరిపారు.ఆందోళనకారులపై బాష్పవాయువుతో పాటు రబ్బర్ బుల్లెట్లను పోలీసులు ప్రయోగించారు.

PREV
click me!

Recommended Stories

Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?
Telangana Rising 2047: చైనాలోని ఆ నగరంలా తెలంగాణ.. సీఎం రేవంత్ కొత్త ఫార్ములా