సెలూన్ ముసుగులో గలీజ్ దందా... వనస్థలిపురంలో గుట్టుగా వ్యభిచారం, పట్టుబడ్డ ఇద్దరమ్మాయిలు

By Arun Kumar P  |  First Published Jun 17, 2022, 1:51 PM IST

సెలూన్ ముసుగులో మసాజ్ సెంటర్... మసాజ్ ముసుగులో వ్యభిచారం సాగిస్తున్న ఓ ముఠాను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల దాడిలో ఇద్దరు అమ్మాయిలతో పాటు ముగ్గురు యువకులు పట్టుబడ్డారు. 


హైదరాబాద్: బయటనుండి చూస్తే అదో సెలూన్. లోపలికి వెళితే అదో మసాజ్ సెంటర్. ఇలా సెలూన్ ముసుగులో నడుస్తున్న స్పా సెంటర్ లో అమ్మాయిలో పురుషులకు క్రాస్ మసాజ్ సదుపాయమే కాదు...గలీజ్ దందా కూడా సాగుతోంది.ఇలా సెలూన్ ముసుగులో వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసారు.   

వివరాల్లోకి వెళితే... తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారుప్రాంతాల్లో వ్యభిచార దందా యధేచ్చగా సాగుతోంది. సాప్ట్ వేర్ తో పాటు ఇతర రంగాల్లో పనిచేసే ఉద్యోగులను హైటెక్ పద్దతుల్లో ఆకర్షిస్తున్నారు వ్యభిచార దందా నిర్వహకులు. బయటకు సెలూన్లు, స్పా సెంటర్లుగా కలరింగ్ ఇస్తూ లోపల గలీజ్ దందా సాగిస్తున్నారు. ఇలా వనస్థలిపునంలోని ఓ స్పా సెంటర్లో వ్యభిచార దందా సాగుతున్నట్లు గుర్తించిన పోలీసులు దాడులు నిర్వహించారు. 

Latest Videos

undefined

వనస్థలిపురంలోని మాంగళ్య షాంపింగ్ మాల్ ఎదరుగా వున్న యూనిసెక్స్ సెలూన్ లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. అమ్మాయిలతో మసాజ్ పేరిట విటులను ఆకర్షించి ఈ గలీజ్ దందా నిర్వహిస్తున్నారని పోలీసులు కూడా నిర్దారించుకున్నారు. దీంతో ఎల్బినగర్ ఎస్వోటి పోలీసులు రంగంలోకి దిగారు. 

గురువారం ఎస్వోటి పోలీసులు సెలూన్ పై దాడిచేసి ఇద్దరు అమ్మాయిలతో పాటు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారినుండి కొంత నగదుతో పాటు నాలుగు మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో పట్టుబడిన ఐదుగురిని వనస్థలిపురం పోలీసులకు అప్పగించారు ఎస్వోటి పోలీసులు. 

ఈ వ్యభిచార దందాపై కేసు నమోదు చేసిన వనస్థలిపురం పోలీసులు ముగ్గురు యువకులను రిమాండ్ కు తరలించారు. ఇద్దరు యువతులను రెస్క్యూ హోం కు తరలించారు. అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తున్న సెలూన్ నిర్వహకులను కఠిక చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. 

హైదరాబాద్ లో ఇలా సెలూన్లు, స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచారం సాగుతున్న ఘటనలు అనేకం వెలుగుచూసాయి. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల ఓ స్పా సెంటర్ పై పోలీసులు దాడి చేసారు.  మాదాపూర్ లోని ఫ్యామిలీ సెలూన్ అండ్ స్పాలో వ్యభిచారం నిర్వహిస్తున్న సమాచారం తెలుసుకున్న పోలీసులు దాడి చేశారు.

ఈ దాడిలో నిర్వాహకులు సరూర్ నగర్ కు చెందిన రాసుల మంగ(36), సహ నిర్వాహకులు కూకట్పల్లికి చెందిన కొండూరు పాక సురేష్, విక్కీ,  కస్టమర్ లింగంపల్లికి చెందిన కాకి సునంద్(22) పట్టుబడ్డారు. వీరిని  అదుపులోకి తీసుకున్న పోలీసులు రెండు వేల రూపాయల నగదు,  బ్లాక్ కలర్ టీవీ,  ఒప్పో గోల్డ్ కలర్ సెల్ ఫోన్, వివో బ్లూ కలర్ మొబైల్ తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన అమ్మాయిలను రెస్్క్యూ హోం కు, నిర్వహకులు, విటులను రిమాండ్ కు తరలించారు. 

ఇదిలా ఉండగా పనికోసం ఇంటికి వచ్చిన మైనర్ బాలికతో వ్యభిచారం చేయించిన కేసులో విజయవాడ భవానిపురంలో పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో విజయవాడ చిట్టినగర్ సొరంగం ప్రాంతానికి చెందిన వేముల భాగ్యలక్ష్మి,  కబేలా సెంటర్ కు చెందిన వేముల భార్గవి, వేముల గోపి,  మామిడి ముక్కల మండలం తాడంకి గ్రామానికి చెందిన చలపాటి శ్రీనివాస రావు, గుంటూరు చంద్రమౌళి నగర్ కు చెందిన పోపూరి వెంకట రవికుమార్ లను అరెస్ట్ చేసినట్లు సిఐ మహేంద్ర తెలిపారు. వీరిని రిమాండుకు తరలించారని పోలీసులు చెప్పారు. 
 

click me!