ప్రణయ్ హత్య కేసు: జైలు నుంచి మారుతీరావు విడుదల

By telugu teamFirst Published Apr 28, 2019, 9:34 AM IST
Highlights

మారుతీరావుతో పాటు మరో ఇద్దరు నిందితులు శ్రవణ్ కుమార్, కరీం కూడా జైలు నుంచి విడుదలయ్యారు. మారుతీరావుతో పాటు ఇతర నిందితులకు శనివారం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

మిర్యాలగుడా: ప్రణయ్ హత్య కేసులో నిందితుడు మారుతీరావు వరంగల్ జైలు నుంచి ఆదివారం ఉదయం విడుదలయ్యారు. తన కూతురు అమృత వర్షిణిని కులాంతర వివాహం చేసుకున్నాడనే కోపంతో ప్రణయ్ ని సుపారీ ఇచ్చి చంపిన కేసులో మారుతీరావు నిందితుడనే విషయం తెలిసిందే.

మారుతీరావుతో పాటు మరో ఇద్దరు నిందితులు శ్రవణ్ కుమార్, కరీం కూడా జైలు నుంచి విడుదలయ్యారు. మారుతీరావుతో పాటు ఇతర నిందితులకు శనివారం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, బెయిల్ పత్రాలు రావడంలో జరిగిన జాప్యంతో శనివారం సాయంత్రం వారు విడుదల కాలేదు.

శనివారం రాత్రి జైలు అధికారులకు బెయిల్ పత్రాలు అందాయి. దీంతో మారుతీరావుతో పాటు ఇతర నిందితులను అధికారులు ఆదివారం ఉదయమే విడుదల చేశారు. 

అయితే, తన తండ్రి విడుదలపై కూతురు అమృత తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ కుటంబానికి తండ్రి నుంచి ప్రాణహాని ఉందని ఆమె అంటున్నారు. తమకు రక్షణ కల్పించాలని ప్రణయ్ కుటుంబ సభ్యులు శనివారం మిర్యాలగుడా డిఎస్పీని కలిసి కోరారు.

సంబంధిత వార్తలు

నిలిచిపోయిన ప్రణయ్ హత్యకేసు నిందితుల విడుదల

ప్రాణహాని ఉంది, సుప్రీం కోర్టును ఆశ్రయిస్తాం: బెయిల్ మంజూరుపై అమృత

మారుతీరావుకు బెయిల్... అమృత స్పందన ఇదే...

ప్రణయ్ హత్య కేసు: అమృత తండ్రి మారుతీరావుకు బెయిల్

click me!