చంద్రబాబు శిష్యుడు రేవంత్ తో గద్దర్ రహస్య ఒప్పందం..: కేఏ పాల్ సంచలనం (వీడియో)

Published : Jun 22, 2023, 05:24 PM IST
చంద్రబాబు శిష్యుడు రేవంత్ తో గద్దర్ రహస్య ఒప్పందం..: కేఏ పాల్ సంచలనం (వీడియో)

సారాంశం

ప్రజా యుద్దనౌక గద్దర్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

హైదరాబాద్ : ప్రజా గాయకుడు గద్దర్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పటికే పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న గద్దర్ ను సస్పెండ్ చేసినట్లు   కేఏ పాల్ ప్రకటించారు. గద్దరన్న తీసుకున్న నిర్ణయంతో అంబేద్కర్ ఆత్మ ఘోశిస్తోందని అన్నారు. రేవంత్ రెడ్డికి అమ్ముడుపోయేముందు ఒక్కసారి శరీరంలోని తూటాలను అడిగి వుండాల్సిందని అన్నారు. నిన్ను చంపించబోయిన... తెలంగాణకు బద్దశత్రువు అయిన చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి కి బానిసయ్యావంటే బాధేస్తోంది గద్దరన్న అన్నారు కేఏ పాల్. 

గతేడాది అక్టోబర్ 5న గద్దర్ ప్రజాశాంతి పార్టీలో చేరారని... ఆ తర్వాత రేవంత్ రెడ్డికి అమ్ముడుపోయి పార్టీకి దూరమయ్యాడని పాల్ ఆరోపించారు. ఆ తర్వాత వైఎస్సార్ టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వద్దకు వెళ్లి పాటలు పాడారని... ఇప్పుడు కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారని అన్నారు. గద్దర్ లాంటివారు ఇలా చేస్తారని ఎవరూ ఊహించలేదని అన్నారు. 

వీడియో

మునుగోడు ఎన్నికల సమయంలో ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేస్తానని... బిజెపి, బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను చిత్తు చేస్తానని గద్దర్ అన్నారని పాల్ గుర్తుచేసారు. పాల్ అన్న రావాలి... పాలన మారాలి అని.... పాల్ తెలంగాణ ప్రజలు కన్నీళ్ళు తుడుస్తాడు అని... బడుగు బలహీనవర్గాల నాయకుడు కేఏ పాల్ అని అన్నది నువ్వేకదా గద్దరన్న... మరి ఇప్పుడు ఎందుకు అమ్ముడుపోయావంటూ పాల్ ప్రశ్నించారు.  

గద్దర్ పాడిన ఓ పాటను గుర్తుచేసిన పాల్ బానిసలారా రండిరా... రేవంత్ రెడ్డి మద్దతివ్వండిరా... బానిసలారా రండిరా... మన బతుకులు అమ్ముకుందామురా అంటూ పాడుకోవాలంటూ ఎద్దేవా చేసారు. డెబ్బై ఏళ్ల వయసులో వున్న గద్దర్ లాంటివారే లొంగిపోతే బడుగు బలహీన వర్గాలకు పరిస్థితి ఏమిటన్నారు. ఇప్పటికైనా బడుగు బలహీనవర్గాలందరూ ఏకమై ప్రజ పాలన తీసుకురావాలని... ఇది ప్రజాశాంతి పార్టితోనే సాధ్యమని పాల్ అన్నారు.    
 

PREV
click me!

Recommended Stories

KTR Comments: "లంగా మాటలు దొంగ మాటలు "రేవంత్ రెడ్డి పై కేటిఆర్ పంచ్ లు| Asianet News Telugu
Revanth Reddy vs KTR | రేవంత్ రెడ్డి vs కేటిఆర్ డైలాగ్ వార్ | Asianet News Telugu