ప్రగతి భవన్ ముట్టడి, నిన్న రేవంత్ రెడ్డి, నేడు ఏబీవీపీ: ఎసీపీపై వేటు

By narsimha lodeFirst Published Oct 23, 2019, 1:23 PM IST
Highlights

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఏబీవీపీ, కాంగ్రెస్ పార్టీ వేర్వేరుగా ఆందోళనలు నిర్వహించాయి. బుధవారం నాడు ఏబీవీపి కార్యకర్తలు ప్రగతి భవన్ లోకి చొచ్చుకువెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ నెల 21న రేవంత్ రెడ్డి కూడ ప్రగతి భవన్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు.

ప్రగతి భవన్ వద్ద సెక్యూరిటీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను ఆసిప్ నగర్ ఏసీపీ నంద్యాల నరసింహారెడ్డిపై వేటు పడింది. ప్రగతి భవన్ ముట్టడించేందుకు ఏబీవీపి బుధవారం నాడు పిలుపునిచ్చింది. ఈ నెల 21న రేవంత్ రెడ్డి కూడ ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించాడు.  ప్రగతి భవన్ వద్ద సెక్యూరిటీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాడని ఆసిఫ్ నగర్ ఏసీపీ నంద్యాల నరసింహారెడ్డిపై వేటు వేశారు పోలీసు ఉన్నతాధికారులు.

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా బుధవారం నాడు ప్రగతి భవన్ ముట్టడించాలని  ఏబీవీపీ పిలుపునిచ్చింది. ఏబీవీపీ కార్యకర్తలు విడతలు విడతలుగా ప్రగతి భవన్ ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. ప్రగతి భవన్ వద్ద ఏబీవీపీ కార్యకర్తల ముట్టడిని అడ్డుకోవడంలో పోలీసులు వైఫల్యం చెందారని పోలీసులు బాస్‌లు భావించారు.

ప్రగతి భవన్ వద్ద నిరసనకారులు రాకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అయితే ఫెన్సింగ్ ‌పై జంప్ చేస్తూ ఏబీవీపీ కార్యకర్తలు ప్రగతి భవన్ ప్రధాన గేటు వైపుకు చొచ్చుకు వచ్చారు. ఈ క్రమంలో ఏబీవీపీ కార్యకర్తలను అదుపు చేయడానికి కొంత కష్టపడ్డారు.

ఓ ఏబీవీపీ కార్యకర్త చేతిలో ఏబీవీపీ జెండాను చేతపట్టుకొని  ఫెన్సింగ్‌పై నుండి దూకుతూ ప్రగతి భవన్ గేటు వైపుకు దూసుకు వెళ్లాడు. అతి కష్టం మీద అతడిని పోలీసులు పట్టుకొన్నారు. 

ఈ నెల 21 వ తేదీన  ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ప్రగతి భవన్  ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో  భాగంగా ప్రగతి భవన్ ముట్టడికి పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రయత్నించారు.

ప్రగతి భవన్ వద్దకు మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, తెలంగాణ  కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ లు ప్రగతి భవన్ వద్ద అరెస్ట్ అయ్యారు.

రేవంత్ రెడ్డి బైక్ పై వచ్చి ప్రగతి భవన్ ‌లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.ఈ రెండు ఘటనల్లో కూడ 
ప్రగతి భవన్ వద్ద సెక్యూరిటీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహారించినందుకు గాను ఆసిఫ్ నగర్ ఏసీపీ నంద్యాల నరసింహారెడ్డిపై వేటు పడింది.

ఆర్టీసీ కార్మికులు ఈ నెల 5వ తేదీ నుండి సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెకు, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, జనసేనలు మద్దతు ప్రకటించాయి. ఈ సమ్మెకు మద్దతుగా బస్ భవన్ ముట్టడికి  వామపక్ష విద్యార్థి సంఘాలు గతంలోనే నిర్వహించాయి. ఇవాళ ఏబీవీపీ కార్యకర్తలు ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించాయి.

కేసీఆర్ మొండిపట్టు, జేఎసీ నేతలకు తమిళిసై దిక్కు...

కేసీఆర్ సమావేశం, ఏం చేస్తారు?...

click me!