సలార్ షూటింగ్ కోసం రామగుండం.. సీపీని కలిసిన ప్రభాస్...

Published : Jan 29, 2021, 03:56 PM IST
సలార్ షూటింగ్ కోసం రామగుండం.. సీపీని కలిసిన ప్రభాస్...

సారాంశం

రామగుండంలో రెబల్ స్టార్ ప్రభాస్ సందడి చేశాడు. సలార్ మూవీ షూటింగ్ కోసం ఈ యంగ్‌ రెబల్‌ స్టార్‌ రామగుండం వచ్చాడు. అక్కడ పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. 

రామగుండంలో రెబల్ స్టార్ ప్రభాస్ సందడి చేశాడు. సలార్ మూవీ షూటింగ్ కోసం ఈ యంగ్‌ రెబల్‌ స్టార్‌ రామగుండం వచ్చాడు. అక్కడ పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. 

ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న సలార్‌ చిత్రం రామగిరి మండలం ఓసీపీ-2లో షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా రామగుండంకు వచ్చిన ప్రభాస్ సీపీని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభాస్‌ సీపీ కార్యాలయానికి రావడంతో ఆయనను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. 

సలార్‌ చిత్రంలో భాగంగా బొగ్గు గని ప్రాంతంలో ఫైట్‌ సీన్లను తెరకెక్కించనున్నారు. ఇప్పటికే చిత్ర బృందం ఆర్జీ-3 పరిధిలోని ఓసీపీ-2 ప్రాజెక్టు వద్ద సెట్టింగ్‌ వేసింది. ఇక్కడ పది రోజుల పాటు ఓపెన్‌ కాస్ట్‌ గనిలో షూటింగ్‌ జరగనున్నట్టు తెలుస్తోంది. 

చిత్ర బృందానికి పదిరోజుల పాటు సింగరేణి అతిథి గృహాలను కేటాయించినట్లు సమాచారం. 
హోంబలే ఫిలింస్‌ బ్యానర్‌పై విజయ్‌ కిరంగందూరు నిర్మాణంలో రూపొందుతున్నఈ మూవీకి సినిమాటోగ్రఫీ భువన్‌ గౌడ, సంగీతం రవి బస్రూర్‌ అందిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?