
సిరిసిల్ల కలెక్టరేట్ శంకుస్థాపన కార్యక్రమం మొదలైంది. అందరూ కొబ్బరికాయలు కొట్టిర్రు. సభ మొదలైంది. సిఎం కేసిఆర్ చిన్ననాటి సంగతులు చెప్పి మురిపాలు కురిపించిర్రు కేటిఆర్. తర్వాత సిఎం ప్రసంగం మొదలైంది. ఆయన కూడా కేటిఆర్ మీద మురిపాలు కురిపించిర్రు. చలోక్తులు విసిరిర్రు. తర్వాత సిఎం ప్రసంగం వేడెక్కింది. బతుకమ్మ చీరల విషయంలో రాజకీయం చేసిర్రంటూ ఘాటుగా మాట్లాడిర్రు సిఎం. కేసిఆర్ మాటల్లో కరుకుదనం పెరుగుతున్నది. పదజాలం పరుషంగా వస్తున్నది. అంతలోనే ఒక్కసారిగా కేసిఆర్ ప్రసంగానికి బ్రేక్ పడ్డది.
ఏమైంది అని అంతటా టెన్షన్ టెన్షన్.ఈట రాజేందర్, కేటిఆర్, సభ మీద ఇటు అటు తిరుగుతున్నరు. సభ వేదిక మీదున్న అధికారుల్లో టెన్షన్, నాయకుల్లో టెన్షన్.
టివిల్లో లైవ్ చూస్తున్నవారిలోనూ టెన్షన్. తీరా అసలు విషయం తెలిసే సరికే అదరూ ఊపిరి పీల్చుకున్నారు.
అప్పుడు సిఎం మైకు కట్ అయింది. రెండు నిమిషాల పాటు మైకు సతాయించింది. కరంటు ఆగిపోయింది. దీంతో కరంటు వచ్చిన తర్వాత సిఎం మాట్లాడుడు మళ్లీ స్టార్ట్ చేసిండు.
సిరిసిల్ల కరంటోళ్లు సన్నాసులు
రాష్ట్రంలో ఏడ కరంటు పోతలేదు. మీ సిరిసిల్లలనే పోతున్నది. ఆడెవడో సన్నాసి ఉన్నట్లున్నడు. అందుకే కరంటు తీసిండు. మీకు రోజు కరంటు పోతుందా అంటూ అక్కడి వారిని అడిగిండు సిఎం. అయితే మాకు రోజు ఏం పోతలేదని జనాలు చెప్పిర్రు. దీంతో వాడెవడో సన్నాసి నన్నే తిప్పలపెడుతున్నడా? రాష్ట్రమంతా కరంటు పోదుకానీ నేను వచ్చిననాడే కరంటు తీసిండంటే సన్నాసే కదా? అని ప్రశ్నించిర్రు. తర్వాత మళ్లీ తన ప్రసంగాన్ని కొనసాగించారు కేసిఆర్.