టీఆర్ఎస్ భయపడుతోంది.. పొన్నం ప్రభాకర్

Published : Sep 28, 2018, 03:02 PM IST
టీఆర్ఎస్ భయపడుతోంది.. పొన్నం ప్రభాకర్

సారాంశం

జరగబోయే ఎన్నికలు టీఆర్‌ఎస్‌కు, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న ఎన్నికలుగా ఆయన అభివర్ణించారు.

వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా తమ కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుందని ఆ పార్టీ నేత పొన్నం ప్రభాకర్  ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి టీఆర్ఎస్ లో భయం మొదలైందని పొన్నం అభిప్రాయపడ్డారు. 

శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలపై ఉద్దేశపూర్వకంగా కేసులు పెడుతున్నారని అన్నారు. జరగబోయే ఎన్నికలు టీఆర్‌ఎస్‌కు, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న ఎన్నికలుగా ఆయన అభివర్ణించారు. ప్రజలు ధర్మంవైపే నిలబడాలని పొన్నం పిలుపు ఇచ్చారు. ప్రభుత్వ వేధింపులకు కాంగ్రెస్‌ కార్యకర్తలు భయపడొద్దని అన్నారు. ఏకగ్రీవ తీర్మానాల సంస్కృతి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తోందని ఆయన విమర్శించారు. గవర్నర్‌ నరసింహన్ కేసీఆర్‌కు తొత్తుగా మారారని, అబద్ధాల అంబాసిడర్‌గా అవతారం ఎత్తారని పొన్నం ప్రభాకర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

PREV
click me!

Recommended Stories

Medicover Hospitals: అరుదైన అకలేషియా కార్డియాకు POEM చికిత్స.. 61 ఏళ్ల మహిళకు కొత్త జీవితం !
Scrub Typhus : తెలుగు రాష్ట్రాల్లో కొత్త వ్యాధి.. ఏమిటిది, ఎలా సోకుతుంది, లక్షణాలేంటి?