నీ చరిత్ర చెబితే.. బయట తిరగలేవు కేటీఆర్... పొన్నం

Published : Aug 16, 2018, 03:36 PM ISTUpdated : Sep 09, 2018, 12:25 PM IST
నీ చరిత్ర చెబితే.. బయట తిరగలేవు కేటీఆర్... పొన్నం

సారాంశం

ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది. చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్లు మధ్యలో వచ్చిన లుచ్చాగాళ్లు ఎవరు?.

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పై టీపీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమెరికాలో చిప్పలు కడిగిన కేటీఆర్, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం సమయంలో ఇక్కడికి వచ్చి కండకావరంతో మదమెక్కిన ఆంబోతుల వ్యవహరిస్తున్నారని పొన్నం విమర్శించారు. కేటీఆర్ చరిత్ర బయటపెడితే బయట తిరగడలేడన్నారు. సమయం వచ్చినప్పుడు అన్నీ బయటపెడతామని హెచ్చరించారు.

ఇటీవల కేటీఆర్.. కాంగ్రెస్ నేతలు లుచ్చాగాళ్లు అనే పదాన్ని ఉపయోగించి విమర్శించారు. దీనిపై పొన్నం మరింత ఫైర్ అయ్యారు. ‘కేటీఆర్ జెన్నకిడిసిన ఆంబోతులా మాట్లాడుతున్నాడు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది. చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్లు మధ్యలో వచ్చిన లుచ్చాగాళ్లు ఎవరు?. మీ అయ్య(తెలంగాణ సీఎం కేసీఆర్‌)కు రాజకీయ జన్మనిచ్చింది కాంగ్రెస్ అనే విషయం మరిచిపోవద్దు. టీఆర్‌ఎస్‌ చేసిన 6 సర్వేల్లో గ్రాఫ్ పడిపోయిందని తెలిసి, ముందస్తు ఎన్నికలకు సిద్ధపడుతున్నారు. కరీంనగర్‌ జిల్లాను ముక్కలు చేసిన వారే లోఫర్లు, లుచ్చాగాళ్లు. తెలంగాణ తెచ్చుకున్నది నాలుగేళ్లలో రూ.2 లక్షల కోట్ల అప్పులు చేయడానికి కాదు. ప్రజలను తాత్కాలిక భ్రమల్లో ముంచి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు.’ అని మండిపడ్డారు. 

 

for more related news..

లుచ్ఛాగాళ్లు: రాహుల్ గాంధీపై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు

కాళ్లపై పడినప్పుడు తెలీదా: కేటీఆర్ కు రేవంత్ రెడ్డి రిప్లై

చంద్రబాబుకి మరో షాక్.. పార్టీని వీడుతున్న మరో సీనియర్

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu