కాంగ్రెస్ కు షాక్: పార్టీకి రాజీనామా చేసిన పొన్నాల లక్ష్మయ్య

By narsimha lode  |  First Published Oct 13, 2023, 1:37 PM IST

కాంగ్రెస్ పార్టీకి పొన్నాల లక్ష్మయ్య షాకిచ్చారు.  కాంగ్రెస్ పార్టీకి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేశారు. ఎఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు రాజీనామా లేఖను పంపారు.



హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య  శుక్రవారంనాడు రాజీనామా చేశారు.  ఎఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు రాజీనామా లేఖను పంపారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత  పీసీసీ చీఫ్ గా పొన్నాల లక్ష్మయ్య పనిచేశారు.తెలంగాణలో తొలి పీసీసీ చీఫ్ గా  పొన్నాల లక్ష్మయ్య పనిచేశారు. గత కొంత కాలంగా  పొన్నాల లక్ష్మయ్య రాష్ట్ర పార్టీ నాయకత్వం తీరుపై అసంతృప్తితో ఉన్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడ  పొన్నాల లక్ష్మయ్యకు చివరి నిమిషంలో టిక్కెట్టు దక్కింది.  జనగామ అసెంబ్లీ టిక్కెట్టును పొత్తులో భాగంగా  కోదండరామ్ కు కేటాయించాలని కాంగ్రెస్ భావించింది.ఈ విషయమై పొన్నాల లక్ష్మయ్య  కోదండరామ్ తో  చర్చించారు. పార్టీ నాయకత్వంతో మాట్లాడి చివరికి టిక్కెట్టు దక్కించుకున్నారు. కానీ ఆ ఎన్నికల్లో పొన్నాల లక్ష్మయ్య ఓటమి పాలయ్యారు.

Latest Videos

undefined

జనగామ అసెంబ్లీ ఎన్నికల్లో  తనకు కాకుండా కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి టిక్కెట్టు కేటాయిస్తారనే ప్రచారం సాగడంపై లక్ష్మయ్య అసంతృప్తితో ఉన్నారు. బీసీ సామాజిక వర్గం పట్ల  కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం తీరుపై  పొన్నాల లక్ష్మయ్య  రగిలిపోతున్నారు.బీసీ సామాజిక వర్గానికి  కనీసం 48 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని పొన్నాల లక్ష్మయ్య కోరుతున్నారు. ఈ విషయమై పార్టీ నాయకత్వంపై  ఆయన ఒత్తిడి తీసుకువస్తున్నారు.  అయితే  బీసీలకు 34 అసెంబ్లీ సీట్లు కేటాయించే విషయంలో  రాష్ట్ర నాయకత్వం సానుకూలంగా ఉంది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  నీటిపారుదల శాఖ మంత్రిగా పొన్నాల లక్ష్మయ్య పనిచేశారు.  జనగామ డీసీసీ అధ్యక్షుడి నియామకం విషయంలో కూడ పొన్నాల లక్ష్మయ్య అసంతృప్తితో ఉన్నారు.

జనగామ టిక్కెట్టు విషయంలో బలమైన బీసీ నేతకు బదులుగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతకు టిక్కెట్టు ఇవ్వాలనే నిర్ణయం సరైంది కాదని  పొన్నాల లక్ష్మయ్య  వాదిస్తున్నారు.  కాంగ్రెస్ లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పొన్నాల లక్ష్మయ్య గత కొంతకాలంగా బీఆర్ఎస్ నాయకత్వంతో టచ్ లోకి వెళ్లినట్టుగా కూడ ప్రచారం సాగుతుంది.   

ఉదయ్ పూర్ డిక్లరేషన్ అమలు చేసే పరిస్థితి లేదని రాజీనామా లేఖలో పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ మూల సిద్దాంతానికి భిన్నంగా వ్యక్తిస్వామ్యం సాగుతుందని చెప్పారు.కొత్తగా వచ్చినవారికి పెద్దపీట, పాతవారి ఉనికి కోల్పోయే పరిస్థితి వచ్చిందని ఆ లేఖలో  పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు.
 పార్టీ టిక్కెట్లను అమ్ముకుంటున్నారని పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. పార్టీకి సంబంధం లేని వ్యక్తికి పగ్గాలిస్తే బజార్లో గొడ్డును అమ్మినట్టుగా టిక్కెట్లు అమ్ముకుంటున్నారని పొన్నాల లక్ష్మయ్య తీవ్ర ఆరోపణలు చేశారు.

also read:ఈ నెల 18న కొండగట్టునుండి కాంగ్రెస్ బస్సు యాత్ర: ప్రారంభించనున్న రాహుల్
పార్టీ ఎన్నికల వ్యూహాకర్త సర్వే రిపోర్టుల పేరుతో పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారని పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు.ఆవేదనతో పార్టీతో బంధాన్ని తెంచుకుంటున్నట్టుగా  ఆయన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎన్నికల వ్యూహాకర్త సునీల్ పై  ఆరోపణలు చేశారు.డబ్బు, భూములు, విల్లాలు ఇచ్చే వాళ్లకే టిక్కెట్లు ఇస్తున్నారని పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు.
 

click me!