పార్టీలో తాను అనేక అవమానాలను ఎదుర్కొన్నట్టుగా మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు.పార్టీ పరిస్థితుల గురించి చెబితే వినే పరిస్థితుల్లో ఎవరూ లేరన్నారు.
హైదరాబాద్:తనను అవమానపర్చి హేళన చేశారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత శుక్రవారంనాడు హైద్రాబాద్ లోని తన నివాసంలో పొన్నాల లక్ష్మయ్య మీడియాతో మాట్లాడారు.
45 ఏళ్ల రాజకీయ జీవితం తనదన్నారు. 45 ఏళ్ల తర్వాత తాను తీసుకున్న నిర్ణయం బాధగా ఉందన్నారు. కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్నందుకు గర్వంగా ఉందని పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. పేద కుటుంబం నుండి ఈ స్థాయికి వచ్చినట్టుగా పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. కానీ, తనకు జరిగిన అవమానాలతో రాజీనామా చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు.జనగామ నుండి వరుసగా మూడు దఫాలు గెలిచిన బీసీ నేతను అని పొన్నాల లక్ష్మయ్య చెప్పారు.
undefined
పార్టీలో తనకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో మీకు తెలియందని కాదని పొన్నాల లక్ష్మయ్య మీడియా ప్రతినిధులనుద్దేశించి వ్యాఖ్యలు చేశారు.రాజీనామా లేఖలో అన్ని విషయాలను ప్రస్తావించినట్టుగా చెప్పారు. పార్టీ పరిస్థితులను అధిష్టానానికి చెప్పేందుకు వెళ్తే వినేవాళ్లు లేరన్నారు. తనను అవమానపర్చి హేళన చేశారని పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ కు రాజీనామాకు దారి తీసిన పరిస్థితులను వివరిస్తూ పొన్నాల లక్ష్మయ్య కన్నీరు పెట్టుకున్నారు.
also read:కాంగ్రెస్ కు షాక్: పార్టీకి రాజీనామా చేసిన పొన్నాల లక్ష్మయ్య
తన విషయంలోనే ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు. పార్టీకి రాజీనామా చేసినట్టుగా పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. భవిష్యత్తు గురించి తాను ఆలోచించలేదని పొన్నాల లక్ష్మయ్య చెప్పారు.బీఆర్ఎస్ లో చేరుతున్నట్టుగా ప్రచారం సాగుతుందన్నారు. పదవుల కోసం తాను కాంగ్రెస్ కు రాజీనామా చేయలేదని పొన్నాల లక్ష్మయ్య చెప్పారు.కొద్ది మందికే పార్టీలో ప్రాధాన్యత ఇచ్చారని పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. ఇక భరించలేక విసుగుతో పార్టీకి రాజీనామా చేసినట్టుగా పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. మూడుసార్లు వరుసగా గెలిచానన్నారు. 12 ఏళ్లుగా మంత్రిగా పనిచేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.