
బీఆర్ఎస్ తిరుగుబాటు నేత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొత్త పార్టీ స్థాపించనున్నట్టు తెలుస్తోంది. అయితే ఆయనను బీజేపీ, కాంగ్రెస్ తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నా.. ఆయన మాత్రం సొంత పార్టీ వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల తెలంగాణ రైతు సమాఖ్య పేరుతో కొత్త పార్టీ రిజిస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ పార్టీని శ్రీనివాస్ రెడ్డి సన్నిహితులే ఎలక్షన్ కమిషన్ లో రిజిస్టర్ చేయించినట్టు తెలుస్తోంది.
బారాముల్లాలో ఎన్ కౌంటర్, లష్కరే ఉగ్రవాది హతం.. కొనసాగుతున్న ఆపరేషన్
ఈ కొత్త పార్టీ తరఫున తెలంగాణలోని 45 అసెంబ్లీ స్థానాల్లో తన అనుచరులను పోటీ చేయించాలని శ్రీనివాసరెడ్డి భావిస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారు. పోటీ చేసే 45 స్థానాల్లో కచ్చితంగా 15 మందిని గెలిపించుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో అభ్యర్థులను వెతికే పని ఇప్పటికే ప్రారంభమైనట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ లో ఎప్పటి నుంచి ఉండి టిక్కెట్ దక్కని నేతలు, ఆ పార్టీ అధినేతపై కోపంతో ఉన్న నాయకులను అసెంబ్లీ స్థానాల వారీగా వెతుకుతున్నారు.
చెదలను నివారిస్తామని చెప్పి.. బెడ్ రూమ్ లోకి వెళ్లిన దుండగుడు.. తరువాత ఏం జరిగిందంటే ?
దీని కోసం పొంగులేటి పలువురి నమ్మకస్తులను సంప్రదించారు. ప్రజల్లో మంచి పేరు ఉండి, తన పట్ల నమ్మకంగా ఉండేవారిని పార్టీ తరఫున నిలబెట్టాలని ఆయన చూస్తున్నారు. ఇలా పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ఖర్చు మొత్తం తానే భరిస్తానని సన్నిహితులతో చెబుతున్నారని సమాచారం. తన పార్టీ తరఫున గెలిచిన వారు తరువాత ఇతర పార్టీల్లోకి జంప్ కాని నేతలనే ఆయన వెతుకుతున్నారు. ఖమ్మంలో అభ్యర్థులను వెతికే పనిని స్వయంగా ఆయనే చేస్తుండగా.. మహబూబ్‌నగర్ లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు బాధ్యతలు అప్పగించారు. నల్లగొండ జిల్లాలో చకిలం అనిల్‌కుమార్‌కు అందించారు. అలాగే వరంగల్‌లో మాజీ ఎంపీ రామసహాయం సురేందర్‌రెడ్డి కుమారుడికి అందించారని సమాచారం.
మేఘాలయకు పాకిన కుకీ, మైతేయ్ వర్గాల మధ్య ఘర్షణలు.. హింసాత్మక ఘటనల నేపథ్యంలో 16 మంది అరెస్టు..
టీఆర్ఎస్ పార్టీ రిజిస్టర్ అయినప్పటికీ ఆ పార్టీకి ఇంకా ఎన్నికల కమిషన్ కామన్ గుర్తును కేటాయించలేదు. ఎన్నికల వరకు కూడా వచ్చే అవకాశాలు లేవు. దీంతో తన పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులందరికీ ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చెందిన సింహం గుర్తు లభించేలా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తనకు మద్దతుగా నిలుస్తున్న నాయకులతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేటి నుంచి మీటింగ్ లు పెట్టనున్నారని తెలుస్తోంది. మొదటగా నల్లగొండకు చెందిన బీఆర్ఎస్ మాజీ నేత చకిలం అనిల్ కుమార్ తో మాట్లాడనున్నారు. ఈ నెల 15 తరువాత తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కొన్ని రోజుల తరువాత ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఖమ్మంలో జరిగే ఈ సమావేశానికి 2 లక్షల జనాన్ని సమీకరించాలని భావిస్తున్నారు. దీనికి తన అభ్యర్థులందరూ పిలుస్తారని తెలుస్తోంది.