కాంగ్రెస్ సభలో ఫుల్ జోష్.. బీఆర్ఎస్ నేతలు కళ్లద్దాలు తీసుకోవాలి: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Published : Jul 03, 2023, 03:17 PM IST
కాంగ్రెస్ సభలో ఫుల్ జోష్.. బీఆర్ఎస్ నేతలు కళ్లద్దాలు తీసుకోవాలి: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

సారాంశం

ఖమ్మంలో నిర్వహించిన కాంగ్రెస్ జనగర్జన సభలో జోష్ కనిపించిందని మాజీ ఎంపీ పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మంలో సభను అడ్డుకునేందుకు గట్టిగా  ప్రయత్నించారని బీఆర్ఎస్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఖమ్మంలో నిర్వహించిన కాంగ్రెస్ జనగర్జన సభలో జోష్ కనిపించిందని మాజీ ఎంపీ పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మంలో సభను అడ్డుకునేందుకు గట్టిగా  ప్రయత్నించారని బీఆర్ఎస్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోమవారం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఖమ్మం సభను విజయవంతం చేసినవారందరికీ ధన్యవాదాలు అనితెలిపారు. అందరి సహకారంతోనే ఖమ్మం సభను అద్భుతంగా జరుపుకోవడం జరిగిందని అన్నారు. ఖమ్మలో సభ ఏ రేంజ్‌లో సక్సెస్ అయిందో ప్రజలకు తెలుసునని చెప్పారు. సభకు ఎంత మంది  జనం వచ్చారనేది తన నోటితో చెప్పాల్సిన అవసరం లేదని తెలిపారు. 

అధికారం తన చేతిలో లేకపోయిన.. నిత్యం ప్రజలతో సత్సబంధాలు కలిగి ఉన్నానని తెలిపారు. ఎంపీగా  ఉన్నప్పటీ కంటే పదవిలో లేకపోయినప్పుడే ప్రజలు ఎంతో ప్రేమ, అప్యాయత పంచారని చెప్పారు. ఆ ప్రేమను, అప్యాయతను ఎప్పటికీ మరిచిపోనని  అన్నారు. గతంలో ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ సభ కంటే.. కాంగ్రెస సభలోనే జోష్ ఉందన్నారు. కంటి వెలుగు స్కీమ్‌లో బీఆర్ఎస్ నేతలు కళ్లద్దాలు తీసుకోవాలని  సెటైర్లు వేశారు. 

ఇక, ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ జనగర్జన సభ వేదికగా రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. సోనియా గాంధీ ఎంతో సాహసం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ చచ్చిపోతుందని సోనియాకు కూడా తెలుసున్నారు. యువకుల బలిదానాలు మరిన్ని జరగకూడదని సోనియా ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు పొంగులేటి. మాయమాటలు చెప్పి కేసీఆర్ రెండు సార్లు అధికారంలోకి వచ్చారని దుయ్యబట్టారు. ఇచ్చిన వాగ్థానాల్లో ఏ ఒక్కటి ఆయన అమలు చేయలేదని.. తెలంగాణ వచ్చాక 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

2014 ఎన్నికల సమయంలో, 2018లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి గాలికొదిలేశారని పొంగులేటి దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వరంగల్ డిక్లరేషన్‌లో ప్రకటించిన అన్ని కార్యక్రమాలు చేస్తామన్నారు. ఉద్యోగాలు ఇవ్వలేదు.. నిరుద్యోగ భృతి లేదని, వచ్చేది తెలంగాణ ప్రభుత్వమేనని శ్రీనివాస్ రెడ్డి జోస్యం చెప్పారు. భారత్ జోడో యాత్ర ద్వారా కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని ఆయన పేర్కొన్నారు. రాహుల్‌ను ప్రధానిని చేసేలా కృషి చేద్దామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

రాహుల్ గాంధీ రాముడైతే ఇయన హనుమంతుడు.. రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
సంగారెడ్డి భహిరంగ సభలో CM రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| CM Revanth Reddy Smart Ration Cards Launch