రాహుల్‌తో జూపల్లి, పొంగులేటి భేటీకి టైమ్ ఫిక్స్.. టీ కాంగ్రెస్ రాజకీయం ఢిల్లీకి షిఫ్ట్..

Published : Jun 25, 2023, 11:09 AM IST
రాహుల్‌తో జూపల్లి, పొంగులేటి భేటీకి టైమ్ ఫిక్స్.. టీ కాంగ్రెస్ రాజకీయం ఢిల్లీకి షిఫ్ట్..

సారాంశం

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు కాంగ్రెస్ గూటికి చేరడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఢిల్లీకి షిఫ్ట్ అయింది. 

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు కాంగ్రెస్ గూటికి చేరడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఢిల్లీకి షిఫ్ట్ అయింది. కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ అయ్యేందుకు జూపల్లి కృష్ణారావు, పొంగులేటిలు ఈరోజు ఢిల్లీ చేరుకోనున్నారు. వీరిద్దరు ఈ నెల 26న ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. ఈ భేటిలో జూపల్లి, పొంగులేటిల వర్గాలకు చెందిన కొందరు ముఖ్య అనుచరులు కూడా పాల్గొనున్నారు. రాహుల్‌తో భేటీ అనంతరం జూపల్లి, పొంగులేటిలు.. ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే, ప్రియాంక గాంధీలతోపాటు మరికొందరు ముఖ్య నేతలను కలిసే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. 

మరోవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఈరోజు గానీ, రేపు ఉదయం గానీ ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. అలాగే పలువురు టీ కాంగ్రెస్ సీనియర్లు కూడా ఢిల్లీకి చేరుకుంటున్నారు. అదే సమయంలో జూపల్లి, పొంగులేటిల చేరికలతో.. ఉమ్మడి మహబూబ్‌ నగర్‌, ఖమ్మం జిల్లాలో చాలా కాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్లకు అన్యాయం  జరగకుండా కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకుంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన నేతలకు కూడా ఢిల్లీ నుంచి పిలుపువచ్చినట్టుగా తెలుస్తోంది. 

ఇక, కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ అనంతరం జూపల్లి, పొంగులేటిలు.. కాంగ్రెస్‌లో చేరికకు సంబంధించి ప్రకటన  చేయనున్నట్టుగా తెలుస్తోంది. రాహుల్‌తో భేటీ తర్వాత.. ఖమ్మం, మహబూబ్‌ నగర్‌లో సభలు ఎప్పుడు నిర్వహించాలనే విషయంపైనా స్పష్టత వస్తుందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే జులై 2న ఖమ్మంలో భారీ బహిరంగ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పొంగులేటి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా సమాచారం. ఈ సభలకు రాహుల్ గాంధీ హాజరవుతారా? లేదా టీ కాంగ్రెస్‌పై ప్రత్యేక దృష్టి సారించిన ప్రియాంక గాంధీ హాజరవుతారా? అనేది కూడా.. జూపల్లి, పొంగులేటి ఢిల్లీ పర్యటన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave: వ‌చ్చే 4 రోజులు చుక్క‌లే.. గ‌జ‌గ‌జ వ‌ణకాల్సిందే. ఎల్లో అల‌ర్ట్
Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?