
హైదరాబాద్ కుత్బుల్లాపూర్‌లో ఓ పాత బిల్డింగ్ పక్క ఇంటిపై ఒరిగింది. అయితే ఇందుకు ఆ బిల్డింగ్ యాజమాని చేసిన ప్రయత్నం బెడిసికొట్టడమే కారణం. వివరాలు.. చింతల్ శ్రీనివాసనగర్ కాలనీకి చెందిన నర్సింహారావుకు జీ+2 బిల్డింగ్ ఉంది. అయతే చాలా ఏళ్ల కింద కట్టిన బిల్డింగ్ అది. అయితే ప్రస్తుతం అక్కడ రోడ్డు ఎత్తు పెరిగింది. దీంతో వర్షం పడిన సమయంలో వరద నీరు ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఈ క్రమంలోనే జాకీలతో బిల్డింగ్ ఎత్తును పెంచాలని ప్రయత్నం చేసింది. ఇందుకోసం ఓ కాంట్రాక్టర్‌ను సంప్రదించారు. ప్రస్తుతం ఆ బిల్డింగ్‌లో ఉండేవారిని ఖాళీ చేయించి.. బిల్డింగ్ ఎత్తు పెంచే ప్రయత్నం చేశారు.
అయితే ఈ ప్రయత్నం బెడిసికొట్టింది. ఎత్తు పెంచేందుకు వినియోగించిన హైడ్రాలిక్ జాకీలు అదుపు తప్పడంతో బిల్డింగ్.. పక్కనే ఉన్న మరో బిల్డింగ్‌పైకి ఒరిగిపోయింది. దీంతో ఆ బిల్డింగ్‌లోని వారు భయాందళనతో పరుగులు తీశారు. ఇందుకు సంబంధించి పక్క బిల్డింగ్‌లోని వారు అధికారులకు సమాచారం అందించారు. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
అనుమతులు లేకుండా బిల్డింగ్ మరమ్మతులు చేపట్టిన ఇంటి యజమాని నర్సింహారావుపై చర్యలు తీసుకోనున్నట్టుగా అధికారులు చెబుతున్నారు. పక్క బిల్డింగ్‌పైకి ఒరిగి ప్రమాదకరంగా మారిన బిల్డింగ్‌ను కూల్చివేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. బిల్డింగ్ పక్కకు ఒరిగిపోయి ఉండటంతో.. దానికి సమీపంలో నివాసం ఉంటున్న ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇక, ఈ బిల్డింగ్ 2001లో నిర్మించినట్టుగా యాజమాని చెబుతున్నట్టుగా.. అంతకు 10 ఏళ్ల ముందే నిర్మాణం జరిగినట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.