పొలిటికల్ హాట్ టాపిక్.. కాసేపట్లో చిరంజీవి ప్రెస్ మీట్

By ramya NFirst Published Mar 25, 2019, 11:04 AM IST
Highlights

వెండి తెరపై తిరుగులేని రారాజుగా ఎదిగిన చిరంజీవి... పొలిటికల్ గా మాత్రం ఢీలా పడిపోయారు. ప్రస్తుతం ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పేరిట పార్టీ స్థాపించి పోటీకి సిద్ధమౌతున్నాడు.

వెండి తెరపై తిరుగులేని రారాజుగా ఎదిగిన చిరంజీవి... పొలిటికల్ గా మాత్రం ఢీలా పడిపోయారు. ప్రస్తుతం ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పేరిట పార్టీ స్థాపించి పోటీకి సిద్ధమౌతున్నాడు. ఆ పార్టీకి చిరు మరో తమ్ముడు నాగబాబు కూడా మద్దతుగా నిలిస్తున్నాడు. ఈ నేపథ్యంలో.. సోమవారం చిరంజీవి ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నారు. మరి కాసేపట్లో అది ప్రారంభం కానుంది.

అయితే.. ఈ ప్రెస్ మీట్ న్యూస్ ఇప్పుడు పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారింది. ఆ ప్రెస్‌మీట్‌లో ఏం మాట్లాడుతారు? తెలంగాణ రాజకీయ గురించి మాత్రమే మాట్లాడి.. ఏపీ రాజకీయాల గురించి మాట్లాడరా? లేదంటే మాట్లాడతారా?  అని అందరూ చర్చించుకుంటున్నారు.

2009 ఎన్నికలకు ముందు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వైఎస్ మరణించాక పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. కొంతకాలం కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. చిరంజీవిని కాంగ్రెస్ రాజ్యసభకు పంపింది. ఆ పదవీకాలం పూర్తయ్యాక ఆయన దాదాపు రాజకీయాలకు దూరమయ్యారు. 

సినిమాలతో గడుపుతున్న చిరు.. ప్రెస్ మీట్ తమ్ముడికి మద్దతుగా నిలుస్తాడో లేదో చూడాలి.

click me!