కానిస్టేబుల్ శిక్షణ.. రన్నింగ్ చేస్తూ.. కుప్పకూలిన యువకుడు

Published : Feb 14, 2019, 01:19 PM IST
కానిస్టేబుల్ శిక్షణ.. రన్నింగ్ చేస్తూ.. కుప్పకూలిన యువకుడు

సారాంశం

పోలీసు కానిస్టేబుల్ శిక్షణలో అపశ్రుతి చోటుచేసుకుంది.  శిక్షణలో భాగంగా రన్నింగ్ చేస్తూ.. ఓ యువకుడు కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 

పోలీసు కానిస్టేబుల్ శిక్షణలో అపశ్రుతి చోటుచేసుకుంది.  శిక్షణలో భాగంగా రన్నింగ్ చేస్తూ.. ఓ యువకుడు కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని ఎలిమినేడు గ్రామానికి చెందిన ఏకాంబరం(23) అనే యువకుడు కానిస్టేబుల్ శిక్షణ పొందుతున్నాడు. ఈ శిక్షణ కోసం రాచకొండ కమిషనరేట్ కి ప్రతిరోజూ ఉదయం 6గంటలకు వచ్చేవాడు. ఈవెంట్స్ కోసం ఇబ్రహీంపట్నంలో సైంట్ కళాశాలలో శిక్ష కోసం కూడా వచ్చేవాడు.

రోజూలాగానే బుధవారం ఉదయం 6గంటలకు  ఇంటి దగ్గర నుంచి శిక్షణ కేంద్రానికి వచ్చిన ఆ యువకుడు రన్నింగ్ చేస్తుండగా ఒక్క సారి కుప్పకూలిపోయాడు. అప్రమత్తమైన తోటి స్నేహితులు హుటాహుటిన ఇబ్రహీంపట్నంలోని ఓ ఆస్పత్రికి తరలించే లోపే మార్గమధ్యలో కన్నుమూసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఏకాంబరంకి ఈ నెల23న ఈవెంట్ పరీక్ష ఉంది. ఇంతలోనే విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనతో ఏకాంబరం కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్