రాజీనామా చేస్తా: అధిష్టానానికి రేణుకా చౌదరి వార్నింగ్

By narsimha lodeFirst Published Feb 14, 2019, 12:35 PM IST
Highlights

 కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గురువారం నాడు ఆమె హైద్రాబాద్‌లోని తన నివాసంలో భేటీ అయ్యారు.

ఖమ్మం: కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గురువారం నాడు ఆమె హైద్రాబాద్‌లోని తన నివాసంలో భేటీ అయ్యారు.ఖమ్మం ఎంపీ టిక్కెట్టు తనకు ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తానని రేణుకా చౌదరి తన అనుచరులతో చెప్పినట్టు సమాచారం.

ఖమ్మం పార్లమెంట్ సీటు విషయమై తాడో పేడో తేల్చుకోవాలని  అనుచరులు ఆమెపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఖమ్మం ఎంపీ సీటు తనకు కావాలని  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రేణుకా చౌదరి కోరుకొంటున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడ టిక్కెట్ల కేటాయింపు విషయంలో  పార్టీ నాయకత్వం అనుసరించిన విధానాలపై. ఆమె బహిరంగంగానే  అసంతృప్తిని వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే ఖమ్మం పార్లమెంట్ సీటు కోసం విహెచ్ లాంటి నేతలు కూడ పోటీ పడడాన్ని రేణుకా చౌదరి అనుచరులు వ్యతిరేకిస్తున్నారు.ఖమ్మం పార్లమెంట్  సీటు విషయమై రేణుకా చౌదరి పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.

ఖమ్మం పార్లమెంట్ సీటును తనకు కేటాయించాలని రేణుకా చౌదరి డిమాండ్ చేస్తున్నారు. ఈ సీటు తనకు కేటాయించకపోతే  ఏం చేయాలనే దానిపై కూడ రేణుకా చౌదరి కార్యకర్తలతో చర్చించనున్నట్టు సమాచారం. ఒకవేళ ఈ సీటును తనకు దక్కకుండా చేస్తే పార్టీకి రాజీనామా చేస్తానని ఆమె అనుచరులతో చెప్పినట్టు సమాచారం.

గురువారం నాడు హైద్రాబాద్‌లోని తన నివాసంలో రేణుకా చౌదరి  ఖమ్మం జిల్లాకు చెందిన తన అనుచరులతో సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.

 


 

click me!