
హైదరాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో 19 ఏళ్ల యువకుడు, వివాహిత (28) అనుమానాస్పద స్థితి మృతి సంగతి తెలిసిందే. ఇది జరిగిన ఒక రోజు తర్వాత, వారి హత్యకు అక్రమ సంబంధమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. హత్యలో మహిళ భర్త లేదా అతని కుటుంబ సభ్యుల పాత్ర ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. యువకుడు, మహిళ మూడు రోజుల క్రితం అదృశ్యమయ్యారు. వారి మృతదేహాలు ఆదివారం ఏకాంత ప్రదేశంలో గుర్తించబడ్డాయి.
ఆ మహిళ తన భర్తతో విడిపోయింది. తన ఇద్దరు పిల్లలతో కలిసి తల్లిదండ్రుల ఇంట్లో నివసిస్తోందని పోలీసులు తెలిపారు. ఆ తరువాత యువకుడితో సంబంధం ఏర్పడింది. ఇధి ఆమెతో విడిపోయిన భర్తకు తెలిసింది. దీంతో ఆ భర్త వీరిద్దరిపై పగ పెంచుకున్నాడని పోలీసులు తెలిపారు. భర్తే హత్య చేసి ఉంటాడని యువకుడి కుటుంబీకులు ఫిర్యాదు చేశారు.
అనుమతులు లేని ప్రైవేట్ యూనివర్శిటీల రద్దు: సబితా ఇంటి ముందు ఎన్ఎస్‌యూఐ ధర్నా
ఇదిలా ఉండగా, విశాఖపట్నంలో భర్తను హతమార్చి కార్డియాక్ అరెస్ట్‌గా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన ఓ మహిళను, ఆమె ప్రేమికుడు, మరో నలుగురిని చోడవరం పోలీసులు అరెస్టు చేశారు. బాధితుడు ఎల్ హరి విజయ్ అనే ఫైనాన్షియర్ గా గుర్తించారు. ఏఎస్‌ఆర్ జిల్లా జి మాడుగుల మండలం నేరేడువలస గ్రామానికి చెందిన హరి విజయ్ అనే ఫైనాన్షియర్ ఏఎస్‌ఆర్ జిల్లా ముంచింగిపుట్ మండలం చివుకుచింత గ్రామానికి చెందిన సామిరెడ్డి ప్రీతిని ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆ తరువాత ఆమె ఆరోగ్య బాగా లేకపోవడంతో కొన్నేళ్ల క్రితం చికిత్స కోసం.. హరి విజయ్ తన కుటుంబంతో అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణంలోని మారుతీ నగర్‌కు వచ్చాడు. ప్రీతి తండ్రి శంకర్ రావు కూడా తమ కుమార్తె చికిత్స కోసం అక్కడికే షిప్ట్ అయ్యాడు. ఈ హత్య విచారణలో, చోడవరం నివాసి బిఎస్‌ఎస్ ప్రణయ్‌తో ప్రీతికి అక్రమ సంబంధం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయం ప్రీతి భర్తకు తెలియడంతో.. వారి సంబంధాన్ని వదులుకోమని హెచ్చరించాడు.
అంతేకాదు ప్రీతిని శారీరకంగా, మానసికంగా తీవ్రంగా వేధించాడు. దీంతో ప్రీతి భర్తను చంపేందుకు తన తండ్రి, స్నేహితులు, ప్రేమికుడితో కలిసి కుట్ర పన్నారు’’ అని పోలీసులు తెలిపారు. ప్రీతి తన తండ్రితో పాటు మరికొంత మందితో కలిసి ఏప్రిల్ 17న చోడవరం వద్ద హరి విజయ్‌ను హత్య చేసి, గుండెపోటుకు గురయ్యాడని తెలిపారు. మృతదేహాన్ని ఏఎస్‌ఆర్ జిల్లా పాడేరులోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.. అని పోలీసులు చెప్పారు.
పాడేరు పోలీసులు తొలుత సిఆర్‌పిసి సెక్షన్ 174 (అనుమానాస్పద మృతి) కింద కేసు నమోదు చేశారు. అయితే పోస్టుమార్టం నివేదికలో అతని మెడ చుట్టూ గుర్తులు ఉండడంతో దర్యాప్తు చేపట్టారు. పాడేరు పోలీసులు శంకర్‌రావును విచారించగా.. హరి విజయ్‌ని ప్రీతి, తనతోపాటు మరికొందరు హత్య చేసినట్లు అంగీకరించారు. శంకర్‌రావును అరెస్టు చేసిన పోలీసులు కేసును చోడవరం పోలీసులకు బదిలీ చేశారు.
ప్రీతి, ఆమె ప్రేమికుడు, ఆమె తండ్రి ఏప్రిల్ 17 రాత్రి బాధితుడికి మద్యం తాగించి, ఆపై దిండు, దుప్పటితో అతనిని చంపినట్లు పోలీసులు తెలిపారు. ప్రీతి, ప్రణయ్, లాలిన్ కుమార్, కర్రి రాము, పిట్ల కొండ రాజు అలియాస్ బషీర్, ఆమె తండ్రి శంకర్ రావులను అదుపులోకి తీసుకున్నారు.