అనుమతి లేని ప్రైవేట్ యూనివర్శిటీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముందు ఎన్ఎస్‌యూఐ ఆందోళనకు దిగింది.
హైదరాబాద్: తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముందు మంగళవారంనాడు ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అనుమతి లేని ప్రైవేటీ యూనివర్శిటీలను రద్దు చేయాలని ఎన్ఎస్‌యూఐ నేతలు డిమాండ్ చేశారు.
ప్రైవేట్ యూనివర్శీలు అనుమతులు తీసుకోకుండానే విద్యార్ధులకు ఆడ్మిషన్లు ఇచ్చారని ఎన్‌ఎస్‌యూఐ నేతలు గుర్తు చేశారు. అనుమతులు లేని కారణంగా ఆయా యూనివర్శిటీల్లో వద్యార్ధులకు సెమిస్టర్ పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ఎన్‌ఎస్‌యూఐ నేతలు ప్రశ్నించారు. అనుమతులు లేకుండా యూనివర్శిటీలు నిర్వహిస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్‌యూఐ డిమాండ్ చేసింది. ఇవాళ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసం ముందు ఆందోళనకు దిగిన ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ సహా ఎన్ఎస్‌యూఐ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేసి గోషామహల్ స్టేడియానికి తరలించారు.