జైపాల్‌రెడ్డికి షాక్: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌ బయటే నిలిపేసిన పోలీసులు

By narsimha lodeFirst Published Aug 13, 2018, 2:47 PM IST
Highlights

 కాంగ్రెస్ పార్టీ  చీఫ్ రాహు‌ల్ గాంధీకి స్వాగతం పలికేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్లేందుకు మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డికి పోలీసులు అనుమతించలేదు

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ  చీఫ్ రాహు‌ల్ గాంధీకి స్వాగతం పలికేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్లేందుకు మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డికి పోలీసులు అనుమతించలేదు. కేవలం పది మంది సీనియర్ నేతలకు మాత్రమే పోలీసులు అనుమతించారు. అయితే పీసీసీ పోలీసులకు ఇచ్చిన జాబితాలో రాహుల్‌గాంధీ పేరు లేదు. దీంతో  రాహుల్ గాంధీకి స్వాగతం తెలిపేందుకు ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్లేందుకు జైపాల్ రెడ్డికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు.

రెండు రోజుల పర్యటన నిమిత్తం  కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ  సోమవారం నాడు హైద్రాబాద్‌కు వచ్చారు. ఆ సమయంలో  రాహుల్ గాందీకి స్వాగతం పలికేందుకు వెళ్లిన జైపాల్ రెడ్డికి నిరాశే ఎదురైంది. కాంగ్రెస్ పార్టీ  తెలంగాణ రాష్ట్ర శాఖ పోలీసులకు ఇచ్చిన జాబితాలో  సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి జైపాల్ రెడ్డి పేరు లేదు. 

దీంతో జైపాల్ రెడ్డిని పోలీసులు శంషాబాద్ ఎయి‌ర్‌పోర్టు వెలుపలే నిలిపివేశారు.  విఐపీ టెర్మినల్ కు  రెండు కిలోమీటర్ల దూరంలోనే కాంగ్రెస్ పార్టీ నేతలను నిలిపివేశారు.  అనుమతి ఉన్న 10 మంది నేతలను మాత్రమే రాహుల్‌కు స్వాగతం పలికేందుకు అనుమతిచ్చారు. 

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన  జాబితాలో జైపాల్ రెడ్డి పేరును తెలంగాణ రాష్ట్ర శాఖ ఎందుకు చేర్చలేదనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జైపాల్ రెడ్డి పేరును ఉద్దేశ్యపూర్వకంగానే చేర్చలేదా.. లేక పొరపాటు జరిగిందా అనే చర్చ సాగుతోంది.  

click me!