దారుణం: భార్యను గొంతుకోసి హత్య చేసిన రిటైర్డ్ ఆర్ఎస్ఐ

Published : Aug 13, 2018, 12:31 PM ISTUpdated : Sep 09, 2018, 12:19 PM IST
దారుణం: భార్యను గొంతుకోసి హత్య చేసిన రిటైర్డ్ ఆర్ఎస్ఐ

సారాంశం

హైదరాబాద్‌ గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొండాపూర్‌లో రిటైర్డ్ ఆర్ఎస్ఐ ఆంజనేయరెడ్డి  తన భార్యను గొంతుకోసి  దారుణంగా హత్య చేశాడు.  ఆ తర్వాత ఆయన పోలీసులకు లొంగిపోయాడు. 


హైదరాబాద్: హైదరాబాద్‌ గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొండాపూర్‌లో రిటైర్డ్ ఆర్ఎస్ఐ ఆంజనేయరెడ్డి  తన భార్యను గొంతుకోసి  దారుణంగా హత్య చేశాడు.  ఆ తర్వాత ఆయన పోలీసులకు లొంగిపోయాడు. 

కుటుంబ కలహాల కారణంగానే అంజయ్య తన భార్యను హత్య చేశాడు.  ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. ఆంజనేయరెడ్డి గతంలో కొండాపూర్ బెటాలియన్‌లో పనిచేశాడు.  కొడవలితో భార్య గొంతును అతి దారుణంగా కోసి హత్య చేశాడు. 

ఆంజనేయరెడ్డికి భార్యకు మధ్య గత కొంతకాలంగా గొడవలు చోటుచేసుకొంటున్నాయి. ఈ గొడవల కారణంగానే  ఆంజనేయరెడ్డి ఆదివారం నాడు రాత్రిపూట భార్యను కొడవలితో  గొంతుకోసి చంపేశాడు.  

సంఘటనాస్థలాన్ని కొండాపూర్ పోలీసులు  పరిశీలించారు. ఆంజనేయరెడ్డి ఎందుకు ఈ హత్య చేయాల్సి వచ్చిందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ