షాకైన పోలీసులు: ఆటోలో ఎంత మందో తెలుసా?

Published : Dec 18, 2020, 05:15 PM IST
షాకైన పోలీసులు: ఆటోలో ఎంత మందో తెలుసా?

సారాంశం

ఉమ్మడి మహాబూబ్‌నగర్ జిల్లాలో సెవెన్ సీటర్ ఆటోలో 17 మందిని  తీసుకెళ్తుండగా పోలీసులు ఆటోను నిలిపివేశారు. ఆటోలో 14 మందితో వారిని గమ్యస్థానాలకు చేరవేస్తున్న విషయాన్ని మహబూబ్ నగర్ పోలీసులు ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.

మహబూబ్‌నగర్: ఉమ్మడి మహాబూబ్‌నగర్ జిల్లాలో సెవెన్ సీటర్ ఆటోలో 17 మందిని  తీసుకెళ్తుండగా పోలీసులు ఆటోను నిలిపివేశారు. ఆటోలో 14 మందితో వారిని గమ్యస్థానాలకు చేరవేస్తున్న విషయాన్ని మహబూబ్ నగర్ పోలీసులు ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.

 

ఉమ్మడి మహాబూబ్‌నగర్ జిల్లాలోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెవెన్ సీటర్ ఆటోలో 17 మంది ప్రయాణీస్తున్నారు.ఈ ఆటోలో నుండి 17 మంది దిగగానే పోలీసులు  షాక్ తిన్నారు. 

ఈ ఫోటోను  ట్విట్టర్లో పోలీసులు షేర్ చేశారు. ఈ ఫోటోపై నెటిజన్లు తలో రకంగా స్పందిస్తున్నారు.ఈ విషయమై  ఆటో డ్రైవర్ తో పాటు ప్రయాణీకులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు.

ఓవర్ లోడ్ తో వాహనాలు నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఆటోలో ప్రయాణించేవారికే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని పోలీసులు వారికి వివరించారు. పరిమితికి మించి ఆటోల్లో ప్రయాణీకులను తరలించవద్దని పోలీసులు కోరారు.

బాలానగర్ కు చెందిన బ్లూకాట్ అధికారులు నర్సింహ్ములు లక్ష్మణ్ లు ఈ ఆటోను నిలిపివేసి డ్రైవర్ సహా ప్రయాణీకులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.


 

PREV
click me!

Recommended Stories

Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌కు దూరంగా అభివృద్ధికి ద‌గ్గ‌ర‌గా.. ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.