యాదాద్రిలో కరోనా అలజడి: లారీ డ్రైవర్ తో సహా క్వారంటైన్ లో 58 మంది!

By Sree sFirst Published Apr 27, 2020, 8:52 AM IST
Highlights

తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఇప్పటివరకు అధికారులు అక్కడ అన్ని జాగ్రత్తలను తీసుకుంటూ జిల్లాను కరోనా ఫ్రీగా ఉంచారు. కానీ తాజాగా చోటుచేసుకున్న సంఘటన ఇప్పుడు అధికారుల తీసుకున్న అన్ని చర్యలకు గండి కొట్టేదిలా ఉంది. 

తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఇప్పటివరకు అధికారులు అక్కడ అన్ని జాగ్రత్తలను తీసుకుంటూ జిల్లాను కరోనా ఫ్రీగా ఉంచారు. కానీ తాజాగా చోటుచేసుకున్న సంఘటన ఇప్పుడు అధికారుల తీసుకున్న అన్ని చర్యలకు గండి కొట్టేదిలా ఉంది. 

తాజాగా రాజస్థాన్ కు చెందిన ఒక ట్రక్ డ్రైవర్ హర్యానా నుండి యాదాద్రి జిల్లా వలిగొండ మార్కెట్ యార్డుకు కు బస్తా సంచులను తీసుకొని వచ్చాడు. వాటిని అన్ లోడ్ చేయడానికి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన 13 మంది హమాలీలు చేరుకొని వాటిని దించారు. 

శనివారం సాయంత్రానికి ఆ బస్తా సంచులను దింపేసి అక్కడి నుండి ఆ డ్రైవర్ లారీ తో సహా హైదరాబాద్ హయత్ నగర్ సమీపంలోని ఆటో నగర్ కి చేరుకున్నాడు. అక్కడ హర్యానా తీసుకెళ్లేందుకు వేరే లోడ్ కోసం ఎదురు చూస్తున్నారు. 

ఈ తతంగం జరుగుతుండగానే సుమారు సాయంత్రం 5 గంటలకు ఆ సదరు ట్రక్ డ్రైవర్ కి రాజస్థాన్ కు చెందిన వైద్య అధికారుల దగ్గరి నుండి ఫోన్ వచ్చింది. అతడితో పాటు కొన్ని రోజుల కింద హర్యానా నుండి రాజస్థాన్ వరకు ప్రయాణించిన వ్యక్తికి కరోనా అని తేలిందని, వెంటనే ఈ డ్రైవర్ , క్లీనర్లు ఇద్దరు కూడా సమీప పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఈ విషయాన్నీ తెలియపరచాలని వారు చెప్పారు. 

వెంటనే ఆ సదరు డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ హయత్ నగర్ నగర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి రిపోర్ట్ చేసారు. వారిద్దరిని ఆదిబట్లలోని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. వారు తెచ్చిన బస్తా సంచుల లోడ్ ని దింపిన కూలీలను, వారి కుటుంబాలను కూడా ఇండ్లలోనే ఐసొలేషన్ లో ఉండమని అధికారులు ఆదేశాలను జారీ చేసారు. 

13 మంది కూలీలతో పాటుగా వారితో సన్నిహితంగా మెలిగిన వారు కుటుంబ సభ్యులు అందరిని కలిపి మొత్తంగా 48 మందిని క్వారంటైన్ కి తరలించినట్టు అధికారులు తెలిపారు.

ఈ సంఘటనతో ఒక్కసారిగా యాదాద్రి జిల్లా అధికారులు పూర్తిగా అప్రమత్తమయ్యారు. మరొక్కసారి ఆ డ్రైవర్, కూలీలు వేరే ఎవర్నైనా కలిసారా అని రెండోసారి కూడా క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. 

click me!