తృటిలో తప్పిన ప్రమాదం:ఖైరతాబాద్‌ సిగ్నల్ వద్ద పోలీస్ వాహనంలో మంటలు

Published : Aug 04, 2021, 11:30 AM IST
తృటిలో తప్పిన ప్రమాదం:ఖైరతాబాద్‌ సిగ్నల్ వద్ద పోలీస్ వాహనంలో మంటలు

సారాంశం

హైద్రాబాద్ ఖైరతాబాద్ సిగ్నల్ వద్ద బుధవారం నాడు ఉదయం పోలీస్ ఎస్కార్ట్ వాహనం మంటల్లో దగ్ధమైంది. వాహనంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించినట్టుగా అనుమానిస్తున్నారు. ఈ  ప్రమాదం నుండి వాహనంలో ఉన్నవారు తృటిలో తప్పించుకొన్నారు.

హైదరాబాద్:నగరంలోని ఖైరతాబాద్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పోలీస్ ఎస్కార్ట్ వాహనంలో మంటలు చెలరేగాయి. వాహనం పూర్తిగా మంటల్లో కాలిపోయింది.బుధవారం నాడు ఉదయం ఖైరతాబాద్ ట్రాఫిక్ సిగ్నల్ వద్దకు  రాగానే  వాహనంలో మంటలు చెలరేగాయి. వాహనంలో మంటలను గుర్తించిన సిబ్బంది  వెంటనే దిగిపోయారు. క్షణాల్లోనే వాహనం మంటల్లో దగ్దమైంది. అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు పైరింజన్ కు సమాచారం ఇచ్చారు. ఫైరింజన్ వచ్చే సమయానికి వాహనం పూర్తిగా మంటలతో దగ్ధమైంది. 

వాహనంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం వాటిల్లిందని అనుమానిస్తున్నారు. ఉదయం పూట  ఈ సిగ్నల్ వద్ద  భారీగా వాహనాల రాకపోకలు సాగుతుంటాయి. ఈ వాహనం మంటల్లో చిక్కుకొనిపోవడంతో  కొద్దిసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. మంటలను అదుపు చేసిన తర్వా త వాహనాన్ని సర్వీస్ సెంటర్ కు తరలించారు పోలీసులు. ఈ వాహనంలో ప్రయాణీస్తున్న పోలీసు సిబ్బంది కూడ ముందుగానే మంటలను గుర్తించి వాహనం దిగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

PREV
click me!

Recommended Stories

Medicover Hospitals: అరుదైన అకలేషియా కార్డియాకు POEM చికిత్స.. 61 ఏళ్ల మహిళకు కొత్త జీవితం !
Scrub Typhus : తెలుగు రాష్ట్రాల్లో కొత్త వ్యాధి.. ఏమిటిది, ఎలా సోకుతుంది, లక్షణాలేంటి?