ఆదిభట్ల యువతి కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు.. డాక్టర్ వైశాలి క్షేమం

By Siva Kodati  |  First Published Dec 9, 2022, 7:39 PM IST

ఆదిభట్లలో డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. కిడ్నాపర్‌ను పట్టుకుని, వైశాలిని రక్షించినట్లుగా తెలుస్తోంది.
 


తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల యువతి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. కిడ్నాపర్‌ను పట్టుకుని, డాక్టర్ వైశాలిని రక్షించారు పోలీసులు. అంతకుముందు తండ్రి దామోదర్‌కు డాక్టర్ వైశాలి ఫోన్ చేసినట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి. తాను క్షేమంగానే వున్నానని ఆమె తెలిపారు. తన గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాను నగరంలోనే వున్నానంటూ తండ్రికి డాక్టర్ వైశాలి చెప్పినట్లుగా ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ తన కథనంలో తెలిపింది. 

ALso Read:ఆదిభట్లలో యువతి కిడ్నాప్ కేసు.. రోడ్డుపై బాధితురాలి కుటుంబ సభ్యుల ధర్నా, సీఐపై ఆరోపణలు

Latest Videos

కాగా... వైశాలి అనే డెంటల్ డాక్టర్ కిడ్నాప్ అయిన వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. దాదాపు 100 మంది రౌడీలతో కలిసి నవీన్ రెడ్డి అనే వ్యక్తి ఆమె ఇంటిపై దాడి చేసి కిడ్నాప్‌కు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో సాగర్ రోడ్డుకు ఇరువైపులా బైఠాయించారు వైశాలి కుటుంబ సభ్యులు. వైశాలిని కాపాడాలంటూ వారు నినాదాలు చేశారు. ఆదిభట్ల సీఐ నరేందర్‌ను సస్పెండ్ చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. 

మరోవైపు.. తన కుమార్తెను మిస్టర్ టీ ఓనర్ నవీన్ రెడ్డి కిడ్నాప్ చేశాడంటూ వైశాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురు కిడ్నాప్‌కు ఆదిభట్ల సీఐ నరేంద్ర నిర్లక్ష్యమే కారణమని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దాడి సమయంలో 100కి కాల్ చేసినా ఎవ్వరూ స్పందించలేదని అమ్మాయి బంధువులు అంటున్నారు. 

click me!