బంగారం కోసం యాచకుడిని.. మద్యం తాగించలేదని స్నేహితుడి..!

Published : Jul 07, 2021, 07:33 AM ISTUpdated : Jul 07, 2021, 07:41 AM IST
బంగారం కోసం యాచకుడిని.. మద్యం తాగించలేదని స్నేహితుడి..!

సారాంశం

అతని నడుముకు, చేతికి వెండి గొలుసు, కడియంతోపాటు.. నగదు ఉన్నట్లు ఎల్లారెడ్డి ప్రాంతానికి చెందిన షేక్ మహబూబ్, ద్యామగారి నారాయణ గుర్తించారు.  

తినడానికి తనకే తిండి లేక.. అందరినీ యాచించి బతుకుతున్న ఓ యాచకుడిని.. అతని వద్ద ఉన్న డబ్బు, నగల కోసం అతి దారుణంగా హత్య చేశారు. మరో వైపు.. స్నేహితుడు తనకు మందు తాగించలేదని కోపంతో.. అతనిని సొంత స్నేహితుడే చంపేశాడు. ఈ రెండు దారుణ హత్యలు ఒకే ప్రాంతంలో చోటుచేసుకున్నాయి. కామారెడ్డిలో చోటుచేసుకున్న ఈ హత్యలను తాజాగా పోలీసులు చేధించారు. ఈ క్రమంలో.. ఈ రెండు ఘటనలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేశారు.

ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని వేణుగోపాలస్వామి ఆలయం వద్ద నర్సింహులు అనే యాచకుడు 2019 నవంబర్ 18న నిద్రపోతున్నాడు. ఈ క్రమంలో అతని నడుముకు, చేతికి వెండి గొలుసు, కడియంతోపాటు.. నగదు ఉన్నట్లు ఎల్లారెడ్డి ప్రాంతానికి చెందిన షేక్ మహబూబ్, ద్యామగారి నారాయణ గుర్తించారు.

ఈ క్రమంలో నిద్రపోతున్న  యాచకుడు నర్సింహులును.. గుడిలో నుంచి బయటకు లాక్కెల్లి బండరాయితో మోది హత్య చేశారు. అతని వద్ద ఉన్న ఐదు తులాల వెండి గొలుసు, తులంన్నర కడియంతో ాపటు రూ.12వేల నగదు దోచుకెళ్లారు. తాజాగా ఈ హత్య కేసులో నిందితులను పోలీసులు పట్టుకున్నారు.

ఇక మరో కేసులో... ఎల్లారెడ్డి మున్సిపాలిటీకి చెందిన షేక్ గాజీ అలియాస్ షేక్ అనే వ్యక్తి గత జూన్ 12న రామాలయం వెనక అనుమానాస్పద స్థితిలో మరణించాడు. మృతుడి భార్య నజియా బేగం ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు  చేపట్టారు.

గాజీ స్నేహితులను పిలిచి విచారించగా..ఎల్లారెడ్డికి చెందిన షేక్ మహబూబ్ అనే వ్యక్తి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. వీరిద్దరూ కలిసి  చిత్తు బొత్తు ఆడేవారు. ఆట పూర్తైన తర్వాత ఇద్దరూ కలిసి  మద్యం తాగాలని అనుకున్నారు. నీ దగ్గర డబ్బులతో మద్యం తాగించమని అడగగా మహబూబ్ ఒప్పుకోలేదు. దీంతో.. తాను అడిగితే మద్యం తాగించలేదని.. ఆగ్రహించాడు. తన డబ్బులతో అయితే.. మందు తాగి.. అతని డబ్బులతో మాత్రం తాగించడం లేదని కోపంతో.. బండరాయితో కొట్టాడు. దీంతో మహబూబ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు ఈ కేసులో నిందితుడిని కూడా తాజాగా అరెస్టు చేశారు, 

PREV
click me!

Recommended Stories

Panic at Hyderabad Gas Stations: యుద్ధం ఎఫెక్ట్! హైదరాబాద్‌లో గ్యాస్ కోసం బారులు | Asianet Telugu
పుకార్లు నమ్మొద్దు.. ఇంధన కొరత లేదు ప్రజలకు సజ్జనార్ విజ్ఞప్తి | Asianet News Telugu