
హైదరాబాద్: తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని, తాను ఎప్పటికీ రాజకీయాల్లోకి ప్రవేశించబోమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షురావు స్పష్టం చేశారు.
ట్విట్టర్ వేదికగా ఆయన ఆ విషయాన్ని వెల్లడించారు. తనకు రాజకీయాలు వద్దని ఆయన అన్నారు. తన లక్ష్యాలు వేరే ఉన్నాయని, తాను సాధించాల్సినవి చాలా ఉన్నాయని ఆయన అన్నారు. తన కలలు తనకు ఉన్నాయని ఆయన అన్నారు. ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నానని అంటూ తాను రాజకీయాల్లోకి రానని హిమాన్షు స్పష్టత ఇచ్చారు.