తెలంగాణ: కొత్తగా 784 కేసులు.. జీహెచ్ఎంసీ, నల్గొండలలో తీవ్రత

Siva Kodati |  
Published : Jul 06, 2021, 09:39 PM IST
తెలంగాణ: కొత్తగా 784 కేసులు.. జీహెచ్ఎంసీ, నల్గొండలలో తీవ్రత

సారాంశం

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,05,186 కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 784 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 89 కొత్త కేసులు వెల్లడి కాగా, నల్గొండ జిల్లాలో 71 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,05,186 కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 784 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 89 కొత్త కేసులు వెల్లడి కాగా, నల్గొండ జిల్లాలో 71 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యల్పంగా నారాయణ్ పేట్ జిల్లాలో 2 కేసులు వెలుగు చూశాయి. అదే సమయంలో 1,028 మంది కొవిడ్ నుంచి కోలుకోగా, 5 మరణాలు సంభవించాయి. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో ఇప్పటి వరకు 3,703 మంది కరోనాతో కన్నుమూశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,28,282 మందికి పాజిటివ్‌గా నిర్థారణ కాగా.. 6,13,124 మంది కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 11,455 మంది చికిత్స పొందుతున్నారు.

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 4, భద్రాద్రి కొత్తగూడెం 32, జీహెచ్ఎంసీ 89, జగిత్యాల 21, జనగామ 10, జయశంకర్ భూపాలపల్లి 15, గద్వాల 4, కామారెడ్డి 5, కరీంనగర్ 51, ఖమ్మం 30, ఆసిఫాబాద్ 5, మహబూబ్‌నగర్ 13, మహబూబాబాద్ 26, మంచిర్యాల 45, మెదక్ 5, మేడ్చల్ మల్కాజిగిరి 37, ములుగు 5, నాగర్ కర్నూల్ 6, నల్గగొండ 71, నారాయణపేట 2, నిర్మల్ 3, నిజామాబాద్ 11, పెద్దపల్లి 52, సిరిసిల్ల 24, రంగారెడ్డి 40, సిద్దిపేట 25, సంగారెడ్డి 16, సూర్యాపేట 31, వికారాబాద్ 5, వనపర్తి 6, వరంగల్ రూరల్ 15, వరంగల్ అర్బన్ 50, యాదాద్రి భువనగిరిలో 22 చొప్పున కేసులు నమోదయ్యాయి. 


 

PREV
click me!

Recommended Stories

Hyderabad: ఇక ఊపిరి పీల్చుకోండి.. రూ. 700 కోట్ల‌తో భారీ ఫ్లై ఓవ‌ర్‌. ఈ ప్రాంతంలో ఊహించ‌ని మార్పు
Indian Air Force Jobs : కేవలం తెలుగు యువతకు మాత్రమే.. ఇంటర్ అర్హతతోనే భారత వాయుసేనలో ఉద్యోగావకాశాలు