అమ్మాయి కోసం గొడవ.. టీఆర్ఎస్ నేత హత్య, కేసు చేధించిన పోలీసులు

By telugu news teamFirst Published Mar 28, 2020, 10:19 AM IST
Highlights

పథకంలో భాగంగా.. ముందు వెళ్లి సయ్యద్ తో గొడవ పడ్డారు. అందరూ కలిసి సయ్యద్ పై దాడి చేయడం మొదలుపెట్టారు. దానిని సయ్యద్ బాబాయి,స్థానిక టీఆర్ఎస్ నేత  షేక్ లతీఫ్(45) కంట పడింది. తన అన్న కొడుకును చంపేస్తున్నారని వెళ్లి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు.
 

ఇటీవల సూర్యాపేటలో ఓ టీఆర్ఎస్ నేత దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. కాగా... ఈ హత్య కేసును పోలీసులు చేధించారు. ఓ అమ్మాయి విషయంలో మొదలైన గొడవే.. టీఆర్ఎస్ నేత ప్రాణాలు కోల్పోవడానికి కారణమైందని పోలీసులు గుర్తించారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. కేతేపల్లి మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన పొడేటి సింహాద్రి నకిరేకల్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో ఇంటర్మీడియట్‌ చదువుతున్నాడు. తన క్లాస్‌మేట్‌ అయిన ఓ అమ్మాయి జన్మదినం సందర్భంగా సింహాద్రి అమె ఫొటోతో కూడిన మెసేజ్‌ను శుభాకాంక్షలు తెలుపుతూ ఇటీవల తన వాట్సాప్‌ స్టేటస్‌లో పోస్టు చేశాడు.

 వాట్సాప్‌ చూసిన కొత్తపేట గ్రామానికి చెందిన షేక్‌ జహంగీర్‌ కుమారుడు సయ్యద్‌  ‘మెనీ మోర్‌ హ్యాపీ రిటర్న్స్‌ ఆఫ్‌ ది డే డార్లింగ్‌’ అని అమ్మాయి బర్త్‌డే ఫొటోపై కామెంట్‌ చేశాడు. దీంతో ఆగ్రహించిన సింహాద్రి...  సయ్యద్‌ను ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు.

Also Read అమ్మాయి కోసం గొడవ... టీఆర్ఎస్ నేత దారుణ హత్య...

సయ్యద్ ని చంపడానికి తన స్నేహితులు కందికంటి రజనీకాంత్, చందుపట్ల వెంకటేష్,  చందుపట్ల వేణు, కందికంటి రాజశేఖర్, చందుపట్ల దిలీప్, చందుపట్ల మల్సూర్, ఏర్పుల భాను, చందుపట్ల ప్రదీప్, మందసాయిలతో కలసి పథకం వేశాడు.

పథకంలో భాగంగా.. ముందు వెళ్లి సయ్యద్ తో గొడవ పడ్డారు. అందరూ కలిసి సయ్యద్ పై దాడి చేయడం మొదలుపెట్టారు. దానిని సయ్యద్ బాబాయి,స్థానిక టీఆర్ఎస్ నేత  షేక్ లతీఫ్(45) కంట పడింది. తన అన్న కొడుకును చంపేస్తున్నారని వెళ్లి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు.

ఈ క్రమంలో.. వారు లతీఫ్ పై దాడి చేశారు. సింహాద్రి అనుచరుల్లో ఒకరైన కందికంటి రజనీకాంత్‌ తమ వెంట తెచ్చుకున్న కత్తితో లతీఫ్‌ ఛాతిపై పొడవగా, కిందపడిపోయిన లతీఫ్‌పై మిగిలిన వారు భౌతిక దాడి చేసి చంపారు. హత్య జరిగిన నాటి నుంచి నిందితులు పరారీలో ఉన్నారు. మృతుడి భార్య షేక్‌ ఉస్మాన్‌బేగం ఫిర్యాదు మేరకు హత్యకేసు నమోదు చేసుకున్న పోలీసులు  నిందితుల కోసం గాలించారు. నిందితులను అరెస్టు చేశారు.

click me!