‘సర్ ఎందుకు అన్న,బ్రదర్ అను చాలు’.. పవన్ తో కేటీఆర్.. ఫ్యాన్స్ ఖుషీ

Published : Mar 27, 2020, 08:56 AM ISTUpdated : Mar 27, 2020, 09:09 AM IST
‘సర్ ఎందుకు అన్న,బ్రదర్ అను చాలు’.. పవన్ తో కేటీఆర్.. ఫ్యాన్స్ ఖుషీ

సారాంశం

కరోనా వైరస్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలుపుతూ.. తన వంతు సాయంగా రెండు తెలుగు రాష్ట్రాలకు 50 లక్షలు చొప్పున రూ. కోటి, కేంద్ర ప్రభుత్వానికి రూ. కోటి (మొత్తం 2 కోట్లు) పవన్ విరాళం ఇచ్చారు

తెలంగాణ మంత్రి కేటీఆర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్య ట్విట్టర్ వేదికగా ఆసక్తికర సంభాషణ జరిగింది. ఇప్పుడు వారి ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవతున్నాయి. వారి సంభాషణ.. ఫ్యాన్స్ లో ఎక్కడలేని ఖుషీ తీసుకువచ్చింది. ఇంతకీ మ్యాటరేంటంటే...

Also Read లాక్ డౌన్ ప్రభావం... ఒంటరితనాన్ని భరించలేక ఉపాధ్యాయుడు ఆత్మహత్య...

కరోనా వైరస్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలుపుతూ.. తన వంతు సాయంగా రెండు తెలుగు రాష్ట్రాలకు 50 లక్షలు చొప్పున రూ. కోటి, కేంద్ర ప్రభుత్వానికి రూ. కోటి (మొత్తం 2 కోట్లు) పవన్ విరాళం ఇచ్చారు. పవన్ మద్దతుకు కేటీఆర్ స్పందిస్తూ.. ‘గొప్ప సందేశమిచ్చారు.. అన్నా..’ అని రిప్లయ్ ఇచ్చారు.

 

కేటీఆర్ రిప్లయ్ చూసిన పవన్ ‘ధన్యవాదాలు సార్.. ఇలాంటి అల్లకల్లోల సమయాల్లో శ్రీ కె.సి.ఆర్ గారి నాయకత్వంలో, ప్రశంసనీయంగా నడుచుకుంటున్న మీ తీరుకు హృదయపూర్వక అభినందనలు. ఆదర్శంగా నిలుస్తున్నారు’ అని మరో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు రిప్లయ్ ఇచ్చిన కేటీఆర్.. ‘ధన్యవాదాలు అన్నా.. ఎప్పటి నుంచి ఇలా సార్ అని పిలవడం మొదలెట్టారు? దయచేసి ఎప్పటిలాగే బ్రదర్ అని పిలవండి’ అని విన్నవించారు. దీనికి వెంటనే పవన్.. ‘అలాగే బ్రదర్’ అని రిప్లయ్ ఇచ్చారు. కేటీఆర్, పవన్ మధ్య జరిగిన ఈ సంభాషణ తాలుకు ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

PREV
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu