తప్పిపోయిన మహిళను కుటుంబసభ్యులకు అప్పగించిన పోలీసులు

By ramya neerukondaFirst Published Oct 11, 2018, 4:34 PM IST
Highlights

సరూర్ నగర్ లో ఒంటరిగా తిరుగుతూ కనిపించింది. గమనించిన  పోలీసులు ఆమెను ఓ అనాథ ఆశ్రమంలో చేర్పించారు. 

మతిస్థిమితం కోల్పోయి...కుటుంబసభ్యులకు దూరమైన ఓ మహిళను పోలీసులు సురక్షితంగా ఇంటికి చేర్చారు. ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ఆధారం చేసుకొని ఆమె వివరాలు సేకరించిన పోలీసులు...ఎట్టకేలకు ఆమెను ఆమె కుటుంబసభ్యులకు అప్పగించగలిగారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. మగాని చంద్రమ్మ అనే మహిళ 6నెలల క్రితం తప్పిపోయింది. సరూర్ నగర్ లో ఒంటరిగా తిరుగుతూ కనిపించింది. గమనించిన  పోలీసులు ఆమెను ఓ అనాథ ఆశ్రమంలో చేర్పించారు. అక్కడికి ఓ పనిమీద వెళ్లిన ఎస్పీవో వంశీకృష్ణ.. ఆమెను చూసి చలించిపోయారు. దీంతో ఆమె వివరాలు తెలుసుకోవాలని ప్రయత్నించారు.

కాగా..  ఆమె మతిస్థిమితం కోల్పోయిందన్న విషయాన్ని గమనించారు. వెంటనే ఆమె వివరాలు తెలుసుకోవాల్సిందిగా ఐటీసెల్  డయల్ 100  పీసీ అధికారి మన్మథరావుని కోరారు. కాగా.. ఫేసియల్ రికగ్నైజేషన్ ద్వారా ఆ మహిళ  చంద్రమ్మగా గుర్తించారు. ఆమె తప్పిపోయినట్లు ఆమె కుటుంబసభ్యులు కొంతకాలం క్రితం ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

వెంటనే ఆమె కుటుంబసభ్యులకు సమాచారం అందించి.. ఆమెను వారికి అప్పగించారు. ఇదేవిధంగా ఫేషియల్ రికగ్నైజేషన్  ద్వారా చాలా కేసులను పరిష్కరించినట్లు పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు. 

click me!