రాజయ్యకు కడియం వార్నింగ్:పద్ధతి మార్చుకో

By Nagaraju TFirst Published Oct 11, 2018, 4:21 PM IST
Highlights

స్టేషన్ ఘన్ పూర్ టీఆర్ఎస్ అభ్యర్థి రాజయ్యపై ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి వార్నింగ్ ఇచ్చారు. పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. నా నియోజకవర్గం అని అనకుండా మనది అనడం నేర్చుకోవాలని కడియం సూచించారు. కలహాలు మాని కలిసి పనిచేయాల్సిందిగా రాజయ్యకు పిలుపునిచ్చారు.  

హైదరాబాద్‌ :స్టేషన్ ఘన్ పూర్ టీఆర్ఎస్ అభ్యర్థి రాజయ్యపై ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి వార్నింగ్ ఇచ్చారు. పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. నా నియోజకవర్గం అని అనకుండా మనది అనడం నేర్చుకోవాలని కడియం సూచించారు. కలహాలు మాని కలిసి పనిచేయాల్సిందిగా రాజయ్యకు పిలుపునిచ్చారు.  

తనకు ఓటు హక్కు వచ్చిన దగ్గరనుంచి కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయలేదని కడియం తెలిపారు. రూమర్లను పట్టించుకోకుండా కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాజయ్య గెలుపు కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ బలపడాలన్నా, కేసీఆర్‌ మళ్లీ సీఎం కావాలన్నా స్టేషన్‌ ఘన్‌పూర్‌లో రాజయ్యను గెలిపించాలని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. రాజయ్య కూడా అందరిని కలుపుకునిపోవాలని, కేసీఆర్ పట్ల ఇష్టం ఉన్నవాళ్లు, కడియం శ్రీహరి అంటే అభిమానం ఉన్న వాళ్ళంతా రాజయ్య అభ్యర్థిత్వాన్ని బలపరచాలని కోరారు.
 
ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది జరగాల్సింది చూడాలి అంటూ కడియం అభిప్రాయపడ్డారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్‌కు తిరుగులేదన్నారు. అంతా కలిస్తే కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాదని జోస్యం చెప్పారు. 

ష్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో రాజయ్యకు నా పూర్తి సహాకారం ఉంటుందని హామీ ఇచ్చారు. తనను అభిమానించే వారందరు పూర్తి స్థాయిలో రాజయ్యకు సహాకరించాలని అలాగే రాజయ్య వర్గీయులు, తన వర్గీయులు, ఉద్యమకారులు అంతా కలిసి స్టేషన్ ఘన్‌పూర్‌లో గులాబీ జెండా ఎగురవేయాల కడియం పిలుపునిచ్చారు. 

click me!