ఒక్క సైగతో పోలీసులు పరుగులు పెట్టాలి.. అక్బరుద్దీన్ పై కేసు నమోదు..

Published : Nov 23, 2023, 09:24 AM IST
ఒక్క సైగతో పోలీసులు పరుగులు పెట్టాలి.. అక్బరుద్దీన్ పై కేసు నమోదు..

సారాంశం

ప్రచార సమయం గడవడానికి ఇంకా ఐదు నిమిషాల టైం ఉంది. అప్పటి వరకు నన్ను మాట్లాడకుండా ఎవరూ ఆపలేరు అంటూ అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

హైదరాబాద్ : ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీపై బుధవారం కేసు నమోదయ్యింది. ఎంఐఎంపార్టీ శాసనసభాపక్ష నేత, చాంద్రాయణగుట్ట అభ్యర్థి అక్బరుద్దీన్ ఓవైసీ పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘నన్ను ఆపే ధైర్యం ఎవరికీ లేదు. నేను సైగ చేస్తే ఇక్కడి నుంచి పోలీసులు పరుగులు పెట్టాలంటూ’ వ్యాఖ్యానించారు. మంగళవారం రాత్రి ఈదిబజార్లో జరిగిన ఎన్నికల సభలో ఆయన ఈ మేరకు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి కారణం ఏంటంటే సంతోష్ నగర్ సిఐ శివచంద్ర.. అక్బరుద్దీన్ ఓవైసీని ప్రసంగం త్వరగా ముగించాలని ప్రచార సమయం గడిచిపోతోందని సూచించారు. దీంతో వాచి చూసుకున్న అక్బరుద్దీన్ ఇంకా ఐదు నిమిషాల టైం ఉందని చెప్పాడు.  అప్పటి వరకు నన్ను మాట్లాడకుండా ఎవరు ఆపలేరు అంటూ వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో అక్బరుద్దీన్ ఓవైసీపై సంతోష్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు చాంద్రాయణగుట్ట రిటర్నింగ్ అధికారి సూర్యప్రకాష్ వివరాలు తెలిపారు. ఈ విషయం తెలిసిన నగర పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య సంతోష్ నగర్ ఠాణాకు వెళ్లారు. అక్బరుద్దీన్ పై కేసు విషయంలో ఆరా తీశారు. అక్కడికి చేరుకున్న మీడియా బృందం సందీప్ శాండిల్యను కేసుకు సంబంధించిన వివరాలు అడిగారు. ఎన్నికలు ప్రజాస్వామ్యంలో పండుగలాంటివని, రాజకీయ పార్టీలు, నేతలు, పోలీసులు ప్రేమానురాగాలతో వ్యవహరించాలని చెప్పుకొచ్చారు.

బీజేపీ స్కెచ్ అదుర్స్.. తెలంగాణలోనే ప్రధాని మోడీ మకాం..

తాను ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేనని.. కొత్త అసెంబ్లీ ఏర్పడే వరకు తానే ఎమ్మెల్యేని చెప్పుకొచ్చారు అక్బరుద్దీన్. ఎన్నికల్లో ప్రచారం చేసుకోవద్దు.. ప్రచారం చేసుకునే నా విధులకు పోలీసులు ఆటంకం కలిగించారు. తిరిగి నా మీదే కేసు పెట్టారు. కేసులు నాకు కొత్త కాదు.. అంటూ తన మీద కేసు పెట్టడం పై చాంద్రాయణ గుట్ట మజిలీస్ అభ్యర్థి అక్బరుద్దీన్ ఓవైసీ  గుట్ట స్పందించారు. బార్కాస్ బజార్లో బుధవారం రాత్రి జరిగిన బహిరంగ సభలో ఆయన సంతోష్ నగర్ పోలీసుల తీరిన విమర్శించారు. 
 

PREV
click me!

Recommended Stories

CM Revanth: ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే చలాన్లు ఆటోమేటిక్‌గా ఖాతా నుంచి కట్ | Asianet News Telugu
విద్యార్థి దశలోనే రోడ్ సేఫ్టీ అవగాహన కల్పించాలి: Revanth Reddy on Road Safety | Asianet News Telugu