హైదరాబాద్‌లో భారీగా పట్టుబడ్డ డబ్బు.. 6 కోట్లు పైనే, ఖమ్మం జిల్లా నేతదిగా అనుమానం..?

Siva Kodati |  
Published : Nov 18, 2023, 04:26 PM IST
హైదరాబాద్‌లో భారీగా పట్టుబడ్డ డబ్బు.. 6 కోట్లు పైనే, ఖమ్మం జిల్లా నేతదిగా అనుమానం..?

సారాంశం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డబ్బు, మద్యం ఎరులై పారుతోంది. అధికారులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ అప్పా జంక్షన్ వద్ద చేపట్టిన తనిఖీల్లో ఆరు కార్లలో సూట్ కేసుల్లో తరలిస్తున్న డబ్బును స్వాధీనం చేసుకున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డబ్బు, మద్యం ఎరులై పారుతోంది. అధికారులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో డబ్బు, బంగారం, ఇతరత్రా భారీగా పట్టుబడుతున్నాయి. తాజాగా హైదరాబాద్ అప్పా జంక్షన్ వద్ద చేపట్టిన తనిఖీల్లో ఆరు కార్లలో సూట్ కేసుల్లో తరలిస్తున్న డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం రూ.6.5 కోట్లుగా వుంటుందని పోలీసులు తెలిపారు. ఖమ్మం జిల్లా నుంచి తొలిసారి అసెంబ్లీకి పోటీ చేస్తున్న వ్యక్తిదిగా అనుమానిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలోనే ఈ డబ్బు తరలిస్తున్నట్లుగా సమాచారం . దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 


 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఉపరితల ఆవర్తనంతో జతకట్టిన ద్రోణి... ఇక భయానక వర్షాలు, ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్
CM Revanth Reddy: పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన CM రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| Asianet Telugu