ఆదిలాబాద్ లో భారీగా నగదు: రూ.10కోట్లు స్వాధీనం

Published : Oct 19, 2018, 07:39 PM IST
ఆదిలాబాద్ లో భారీగా నగదు: రూ.10కోట్లు స్వాధీనం

సారాంశం

 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో డబ్బు తరలింపుపై పోలీస్ యంత్రాంగం దృష్టి సారించింది. అనధికారికంగా డబ్బు తరలించి వారిపట్ల సింహస్వప్నంగా తయారైంది. ఇప్పటికే ప్రత్యేక బృందాలు డబ్బు తరలింపుపై తనిఖీలు చేస్తున్నారు. అందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలం పిప్పర్ వాడ టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

ఆదిలాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో డబ్బు తరలింపుపై పోలీస్ యంత్రాంగం దృష్టి సారించింది. అనధికారికంగా డబ్బు తరలించి వారిపట్ల సింహస్వప్నంగా తయారైంది. ఇప్పటికే ప్రత్యేక బృందాలు డబ్బు తరలింపుపై తనిఖీలు చేస్తున్నారు. అందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలం పిప్పర్ వాడ టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 

అయితే ఒక కారులో రూ.10కోట్లు తరలిస్తుండగా పోలీసులు ఆ కారును ఆపి తనిఖీ చేశారు. పదికోట్ల రూపాయలు సీజ్ చేశారు. కర్ణాటక రిజిస్ట్రేషన్ తో ఉన్న కారులో ఇద్దరు వ్యక్తులు పది కోట్ల రూపాయలతో నాగపూర్ వైపు వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 

ఇద్దరు వ్యక్తులను నగదు కోసం ఆరా తియ్యగా బెంగళూరుకు చెందిన పేపర్ మిల్లు డబ్బు అని వారు చెప్తున్నట్లు పోలీసులు చెప్తున్నారు. అయితే ఎలాంటి ఆధారాలు చెప్పకపోవడంతో వారిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.. అటు ఐటీ అధికారులకు సైతం పోలీసులు సమాచారం అందించారు. జైనాథ్ పీఎస్ లో కేసు నమోదు చేసిన పోలీసులు కేసును విచారిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌