షాక్: ఖాదీర్ ఇంట్లో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

By narsimha lodeFirst Published Aug 14, 2018, 10:59 AM IST
Highlights

హైద్రాబాద్‌ పాతబస్తీలో ఎన్ఐఏ అరెస్ట్ చేసిన  బాసిత్,  ఖాదీర్‌ల ఇంట్లో నుండి  పోలీసులు భారీ ఎత్తున   పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకొన్నారు.  స్థానికంగా దొరికే రసాయనాలతో పేలుడు పదార్థాలను తయారు చేసినట్టు పోలీసులు గుర్తించారు.  


హైదరాబాద్: హైద్రాబాద్‌ పాతబస్తీలో ఎన్ఐఏ అరెస్ట్ చేసిన  బాసిత్,  ఖాదీర్‌ల ఇంట్లో నుండి  పోలీసులు భారీ ఎత్తున   పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకొన్నారు.  స్థానికంగా దొరికే రసాయనాలతో పేలుడు పదార్థాలను తయారు చేసినట్టు పోలీసులు గుర్తించారు.  భారీ విధ్వంసానికి కుట్ర పన్నారని పోలీసులు చెబుతున్నారు.

రెండు రోజుల క్రితం  హైద్రాబాద్ పాతబస్తీలో  బాసిత్, ఖాదీర్ అనే ఇద్దరిని ఐసీస్ అనుమానితులుగా గుర్తించిన ఎన్ఐఏ అరెస్ట్ చేశారు.  వారం రోజుల క్రితం వీరిని అదుపులోకి తీసుకొన్నారు. వీరిని పలు విషయాలపై  విచారించారు.

నిందితులకు సంబంధించి పక్కా ఆధారాలను సేకరించిన తర్వాత వీరిద్దరిని ఐసీస్ అనుమానితులుగా అరెస్ట్ చేసినట్టు ఎన్‌ఐఏ ఆదివారం నాడు ప్రకటించింది.  సోమవారం నాడు ట్రాన్సిస్ట్ వారంట్‌పై  న్యూఢిల్లీకి తరలించారు. 

అయితే స్షానికంగా దొరికే రసాయనాలతో  పేలుడు పదార్థాలను తయారు చేసినట్టు పోలీసులు గుర్తించారు.  హైడ్రోజన్ పెరాక్సైడ్‌, యూరియాలను కలిపి  పేలుడు పదార్థాలను తయారు చేసినట్టు  పోలీసులు గుర్తించారు.

సిమీ నేత సలావుద్దీన్ మేనల్లుడే  బాసిత్. బాసిత్‌ను గతంలో కూడ పోలీసులు అరెస్ట్ చేశారు.  అయితే అప్పటి నుండి కూడ బాసిత్ తన ప్రవర్తనను మార్చుకోలేదు. దీంతో పోలీసులు  బాసిత్ పై నిఘాను ఏర్పాటు చేశారు. ఈ నిఘాలో ఐఎస్‌ ఉగ్రవాదులతో  బాసిత్ ,ఖాదీర్ సంబంధాలను ఏర్పాటు చేసుకొంటున్నట్టుగా గుర్తించారు. 

బాసిత్, ఖాదీర్ ఇంట్లో నుండి లాప్‌టాప్‌లు, పోన్లను స్వాధీనం చేసుకొన్నారు. ఖాదీర్‌ను బాసిత్ ఉగ్రవాదం వైపుకు మళ్లించాడని  ఎన్ఐఏ అధికారులు చెబుతున్నారు.  దీంతో బాసిత్, ఖాదీర్ లతో ఇంకా ఎవరెవరు సంబంధాలను కలిగి ఉన్నారనే విషయమై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

ఈ వార్త చదవండి

హైద్రాబాద్‌లో ఇద్దరు ఐఎస్ అనుమానితుల అరెస్ట్

click me!