పుడింగ్ మింక్ పబ్ కేసు: పోలీసులతో ఆ ఇద్దరి ఛాటింగ్

Published : Apr 06, 2022, 09:32 AM IST
 పుడింగ్ మింక్ పబ్ కేసు: పోలీసులతో ఆ ఇద్దరి ఛాటింగ్

సారాంశం

హైద్రాబాద్ బంజారాహిల్స్ పుడింగ్ మింక్ పబ్  కేసును పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న కిరణ్ రాజు, అర్జున్ లు పోలీసులతో కూడా  చాటింగ్ చేశారని కూడా పోలీసులు గుర్తించారు. 

హైదరాబాద్: నగరంలోని Banjarahills లో  Pudding Mink Pub  కేసులో పోలీసులు కీలక విషయాలను గుర్తించారు. ఈ కేసులో పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న Arjun, Kiran Rajuలు పోలీసులతో కూడా వాట్సాప్ చాటింగ్ చేశారని  గుర్తించారు. 

ఈ నెల 3వ తేదీన తెల్లవారుజామున పుడింగ్ మింక్ పబ్ పై Task Force పోలీసులు దాడి నిర్వహించారు.ఈ సమయంలో పబ్ లో  ఉన్న 145 మంది నుండి సమాచారం సేకరించారు.  వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపారు. అయితే అదే రోజున పబ్ కు మొత్తం 250 మంది వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ పబ్ లో పోలీసులు దాడి చేసిన వారిలో 145 మంది నుండి సమాచారం సేకరించారు. మిగిలిన 105 మంది కోసం పోలీసులు  ఆరా తీస్తున్నారు. పబ్ యాజమాన్యం వద్ద ఈ జాబితాను తీసుకొని వారి గురించి ఆరా తీస్తున్నారు. పబ్ లో సుమారు ఆరు గ్రాముల కొకైన్  ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. అయితే ఈ పబ్ లో పార్టీ సందర్భంగా 35 గ్రాముల డ్రగ్స్ ను వినియోగించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ పబ్ లోని మూడు టేబుల్స్ కు డ్రగ్స్ సరఫరా చేశారని పోలీసులు భావిస్తున్నారు.ఈ మూడు టేబుల్స్ ను ఎవరు బుక్ చేశారనే విషయమై  కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ కేసులో ఇప్పటికే అనిల్ కుమార్, అభిషేక్ ఉప్పల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో వైపు అర్జున్, కిరణ్ రాజుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.  అయితే అర్జున్, కిరణ్ రాజులు Policeలతో కూడా Whats app చాటింగ్ లు నిర్వహించారని కూడా పోలీసులు గుర్తించారు.

ఇదిలా ఉంటే పోలీసులు అరెస్ట్ చేసిన Anil Kumar, Abhishek Uppala ను పోలీసులు తమ కస్టడీకి ఇవ్వాలని కూడా Nampally కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై కోర్టు విచారణ చేయనుంది. ఈ ఇద్దరు నిందితులను ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని బంజారాహిల్స్ పోలీసులు కస్టడీ పిటిషన్ లో కోరారు. నిందితులను విచారిస్తే అసలు విషయాలు వెలుగు చూసే అవకాశం ఉన్నందున వారిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. ఇదిలా ఉంటే నిందితుల తరపు న్యాయవాదులు కూడా బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్