మూడునెలలపాటు కన్నేసి... తర్వాత ఘాతుకం.. విచారణలో షాకింగ్ విషయాలు

By telugu teamFirst Published Dec 10, 2019, 8:01 AM IST
Highlights

సమీప గ్రామానికి చెందిన ఓ మహిళపై అత్యాచారానికి ఒడిగట్టడంతో ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లోనే ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటే షాబొద్దీన్‌ ఇంతటి దారుణానికి పాల్పడి ఉండేవాడు కాదని స్థానికులు చెబుతున్నారు. 

కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కొంత కాలం క్రితం సమత అనే వివాహిత దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే.  నిందితులు ఆమెపై అత్యాచారం చేసి.. అతి కిరాతకంగా హత్య చేశారు. కాగా... ఈ కేసుకు సంబంధించి పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి.

నిందితులకు గతంలోనూ నేర చరిత్ర ఉందని తెలిసింది. నిత్యం మద్యం మత్తులో తూలుతూ తిరిగేవారని గ్రామస్థులు చెబుతున్నారు. ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్న షేక్‌ షాబొద్దీన్‌ గతంలోనూ ఇదే తరహాలో అరాచకాలకు పాల్పడేవాడని చెబుతున్నారు. రెండో నిందితుడు షేక్‌ బాబు తరచూ భార్యతో గొడవ పడుతుండడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. 

మూడో నిందితుడు షేక్‌ మక్దుం చోరీ కేసులో జైలు శిక్ష అనుభవించి ఇటీవలే విడుదలయ్యాడు. ఈ ముగ్గురూ కలిసి అడవిలో విలువైన కలపను నరికి స్మగ్లింగ్‌ చేసే వారని స్థానికులు చెబుతున్నారు. షాబొద్దీన్‌ గతంలో జాముల్‌ధర కోలాంగూడలో ఉంటున్న సమయంలో ఆదివాసీ యువతిపై అఘాయిత్యానికి పాల్పడడంతో దేహశుద్ధి చేసి, గ్రామ బహిష్కరణ చేశారు. దీంతో అతను ఎల్లాపటార్‌కు మకాం మార్చాడు.

AlsoRead ప్రియుడితో సరసాలు.. భర్తను అడ్డుతొలగించుకునేందుకు రూ.8లక్షలతో.....

సమీప గ్రామానికి చెందిన ఓ మహిళపై అత్యాచారానికి ఒడిగట్టడంతో ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లోనే ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటే షాబొద్దీన్‌ ఇంతటి దారుణానికి పాల్పడి ఉండేవాడు కాదని స్థానికులు చెబుతున్నారు. 3 నెలలుగా నిందితులు సమత దంపతుల కదిలికలను గమనిస్తూ వచ్చారు. 

నవంబరు 24న పక్కా పథకం ప్రకారం నిందితులు ఎల్లాపటార్‌ సమీపంలో మాటువేసి సమతను పొదల్లోకి లాక్కెళ్లి దారుణానికి పాల్పడ్డారు. ఆ సమయంలో కాస్త దూరంలోనే రైతు కూలీలు పత్తి సేకరిస్తున్నారు. సమత కేకలు పెట్టినప్పటికీ భార్యాభర్తల గొడవ అనుకొని పట్టించుకోలేదని తెలిసింది. మరుసటి రోజు పత్రికల్లో మహిళ అదృశ్యం వార్తలు రావడం.. పొదల్లో మహిళ మృతదేహాన్ని గుర్తించడంతో సమతపై జరిగిన దారుణం వెలుగు చూసింది.

click me!