సరూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని మ్యాన్ హో ల్ నుండి అప్సర డెడ్ బాడీని పోలీసులు వెలికి తీశారు.
హైదరాబాద్: సరూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయ సమీపంలోని మ్యాన్ హోల్ లో నుండి అప్సర మృతదేహన్ని పోలీసులు శుక్రవారంనాడు వెలికితీశారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఈ నెల 3వ తేదీన అప్సరను సాయికృష్ణ హత్య చేసి మ్యాన్ హోల్ లో డెడ్ బాడీని పూడ్చి పెట్టాడు. ఇవాళ ఉదయం సాయికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అసలు విషయం వెలుగు చూసింది. శంషాబాద్ లో అప్సరను హత్య చేసి సరూర్ నగర్ లోని మ్యాన్ హోల్ లో పూడ్చి పెట్టాడు.ఈ స్థలాన్ని పోలీసులకు సాయికృష్ణ చూపాడు. దీంతో ఇవాళ మధ్యాహ్నం సరూర్ నగర్ మ్యాన్ హోల్ నుండి అప్సర డెడ్ బాడీని వెలికితీశారు.
సరూర్ నగర్ తహసీల్దార్ జయశ్రీ సమక్షంలో పోలీసులు మ్యాన్ హోల్ ను బద్దలు కొట్టి మృతదేహం వెలికితీశారు. మ్యాన్ హో ల్ లో డెడ్ బాడీ బొర్లాపడి ఉందని తహసీల్దార్ జయశ్రీ మీడియాకు చెప్పారు. మృతదేహం ఉబ్బిపోయి ఉందన్నారు. మ్యాన్ హోల్ నుండి అప్సర డెడ్ బాడీ వెలికితీసిన తర్వాత పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అప్సర మృతికి గల కచ్చితమైన కారణాలు పోస్టుమార్టం నివేదికలో తేలుతాయని శంషాబాద్ పోలీసులు చెప్పారు.
also read:ఇతరులతో చనువు, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడితోనే అప్సర హత్య: శంషాబాద్ సీఐ శ్రీనివాస్
సరూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయానికి సమీపంలోనే గుడిలోేనే సాయికృష్ణ పూజారిగా పనిచేస్తుంటాడు. ఈ గుడి పక్కనే ఉండే ఇంటిలో అప్సర కుటుంబం నివాసం ఉంటుంది. గుడికి వచ్చే క్రమంలో అప్సరతో సాయికృష్ణకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసిందని సాయికృష్ణ తమ విచారణలో చెప్పాడని శంషాబాద్ సీఐ శ్రీనివాస్ చెప్పారు. ఈ గుడికి సమీపంలోని వెంకటేశ్వరకాలనీలో సాయికృష్ణ నివాసం ఉంటున్నాడు.