secunderabad violence: రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు.. స్కెచ్ మొత్తం ఆవుల సుబ్బారావుదే..?

By Siva KodatiFirst Published Jun 22, 2022, 5:47 PM IST
Highlights

అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకున్న అల్లర్లకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు ప్రోద్బలంతోనే అభ్యర్ధులు సికింద్రాబాద్‌కు చేరుకున్నట్లుగా తెలుస్తోంది.

అగ్నిపథ్‌కు (agnipath) వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో (secunderabad railway station) చోటు చేసుకున్న అల్లర్లకు సంబంధించి పోలీసుల రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను ప్రస్తావించారు. దీనిలో ఆవుల సుబ్బారావు ప్రోద్బలంతోనే గొడవలు జరిగినట్లుగా ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రచారం చేసింది. సుబ్బారావు (avula subbarao)  ప్లాన్ ప్రకారమే సికింద్రాబాద్ చేరుకున్నారు అభ్యర్ధులు. విధ్వంసానికి పాల్పడిన పృథ్వీరాజ్‌తో పాటు 9 మంది అరెస్ట్ అయ్యారు. అలాగే వాట్సాప్ అడ్మిషన్లను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. 

ఇకపోతే.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకున్న విధ్వంసంకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అల్లర్లు, రైల్వే ఆస్తుల ధ్వంసం, రైళ్లకు నిప్పుపెట్టడం.. వెనక కొందరు కీలకంగా వ్యవహరించినట్టుగా పోలీసులు గుర్తించారు. ఒకరిద్దరు తొలుత రైల్వే బోగీల్లోకి వెళ్లి నిప్పు పెట్టినట్టుగా కనిపిస్తున్న కొన్ని వీడియోలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. కొన్ని తెలుగు న్యూస్ చానల్స్ ఈ దృశ్యాలను ప్రసారం చేస్తున్నాయి. ఆ వీడియోల్లో ఆదిలాబాద్ జిల్లాకు చెందినకు పృథ్వీరాజ్ కూడా ఉన్నాడు.. రైలు బోగీలోకి వెళ్లి పేపర్లకు నిప్పు పెట్టి సీట్లకు నిప్పటించాడు. ఆ దృశ్యాలను వీడియోలు కూడా తీయించుకున్నాడు. 

ALso Read:Secunderabad Violence: వెలుగులోకి రైళ్లకు నిప్పుపెడుతున్న వీడియోలు.. ఏ-2గా ఆదిలాబాద్‌కు చెందిన పృథ్వీరాజ్..

ఒకరిద్దరు ఇలాంటి చర్యలు దిగిన తర్వాత మరికొందరు రైల్వే ఆస్తుల ధ్వంసం చేయడానికి, రైల్వే బోగీలకు నిప్పుపెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే పోలీసులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల అల్లర్లకు సంబంధించి పృథ్వీరాజ్‌ను ఏ-2 చేర్చారు. అతన్ని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో కామారెడ్డి జిల్లాకు చెందిన మధుసూదన్‌ను ప్రధాన నిందితుడిగా (ఏ-1)గా చేర్చారు. ఈ కేసుకు సంబంధించి రైల్వే పోలీసులు 56 మందిని  నిందితులుగా గుర్తించారు. సికింద్రాబాద్ అల్లర్ల‌కు సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరిస్తున్నారు.  

మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి గుంటూరు  జిల్లాలోని నర్సరావుపేటకు చెందిన సాయి డిఫెన్స్ అకాడమీకి చెందిన  ఆవుల సుబ్బారావును తెలంగాణ కు చెందిన టాస్క్ పోర్స్  పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా నుండి నుండి హైద్రాబాద్ కు తీసుకు వచ్చిన తర్వాత  ఆవుల సుబ్బారావును టాస్క్ ఫోర్స్ పోలీసులు రైల్వే పోలీసులకు అప్పగించారు. ఆవుల సుబ్బారావు ను  రైల్వే పోలీసులు నేడు విచారించనున్నారు. 

click me!