నిబంధనలు పాటించని పబ్‌లపై హైదరాబాద్ పోలీసుల కొరడా.. అమ్నిషియాతో పాటు మూడు పబ్‌లపై కేసు..

By Sumanth KanukulaFirst Published Oct 8, 2022, 5:28 PM IST
Highlights

నిబంధనలు పాటించని పబ్‌లపై హైదరాబాద్ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఇటీవల హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘిస్తున్న పబ్‌లపై దృష్టి సారించిన పోలీసులు.. తాజాగా మూడు పబ్‌లపై కేసులు నమోదు చేశారు. 

నిబంధనలు పాటించని పబ్‌లపై హైదరాబాద్ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఇటీవల హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘిస్తున్న పబ్‌లపై దృష్టి సారించిన పోలీసులు.. తాజాగా మూడు పబ్‌లపై కేసులు నమోదు చేశారు. శబ్ధ కాలుష్య నిబంధన పాటించలేదని జూబ్లీహిల్స్  పోలీసు స్టేషన్ పరిధిలోని  అమ్నిషియా, ఎయిర్‌లైవ్‌, జీరో 40 పబ్‌లపై కేసులు నమోదు చేశారు. 

ఇక, హైదరాబాద్‌లోని పబ్‌లలో రాత్రి 10 గంటల తర్వాత సౌండ్ పొల్యూషన్ ఉండకూడదని ఇటీవల తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. రాత్రి వేళల్లో పబ్‌ల నుంచి భారీ శబ్దాలు రావడంపై దాఖలైన పలు పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు స్పందించింది. ఎక్సైజ్ చట్టం ప్రకారం ఇది అనుమతించబడదని.. నివాస ప్రాంతాలలో, పాఠశాలల సమీపంలో పబ్‌లు ఎలా నిర్వహిస్తారని కోర్టు ప్రశ్నించింది. హైదరాబాద్‌లోని పబ్‌లు, బార్‌లలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు సంగీతం లేదా మరే ఇతర సౌండ్‌లను వినియోగించడంపై కోర్టు నిషేధించింది.

సిటీ పోలీస్ యాక్ట్, సౌండ్ పొల్యుషన్ రెగ్యూలేషన్ అండ్ కంట్రోట్ యాక్ట్ ప్రకారం.. పబ్‌లతో పాటు నగరంలో రాత్రి 10 గంటల వరకు మాత్రమే లౌడ్ స్పీకర్లను ఉపయోగించవచ్చని పేర్కొంది. నిర్దేశిత గంటల తర్వాత సౌండ్ సిస్టమ్‌ను అనుమతించబోమని హైకోర్టు స్పష్టం చేసింది. ఎక్సైజ్ నిబంధనల ప్రకారం నివాస ప్రాంతాలు, పాఠశాలలు, కళాశాలల దగ్గర పబ్‌లను ఎలా అనుమతిస్తారని కోర్టు ప్రశ్నించింది. ఈ అంశంపై హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లకు కోర్టు నోటీసులు జారీ చేసింది.

click me!