అప్పుడు టీడీపీ మాదిరే.. రాజ్యసభలో బీజేపీలోకి టీఆర్ఎస్ఎల్పీ , విలీనానికి ఎంపీలు రెడీ : రేవంత్ సంచలనం

Siva Kodati |  
Published : Oct 08, 2022, 05:24 PM IST
అప్పుడు టీడీపీ మాదిరే.. రాజ్యసభలో బీజేపీలోకి టీఆర్ఎస్ఎల్పీ , విలీనానికి ఎంపీలు రెడీ : రేవంత్ సంచలనం

సారాంశం

రాజ్యసభలో బీజేపీ ఫ్లోర్‌లోకి టీఆర్ఎస్ఎల్పీ విలీనం కానుందని బాంబు పేల్చారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. నలుగురు రాజ్యసభ ఎంపీలు విలీనానికి రెడీ అయ్యారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో వున్న వాళ్లకు ఇప్పటికే నోటీసులు వచ్చాయని రేవంత్ వ్యాఖ్యానించారు. 

టీఆర్ఎస్ - బీజేపీ మధ్య యుద్ధం జరుగుతున్నట్లుగా డ్రామాలు చేస్తున్నాయని విమర్శించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజాక్షేత్రంలో లేదన్నట్లుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. రెండు పార్టీల నాటకాన్ని ప్రజలు గ్రహించాలన్నారు రేవంత్. త్వరలో బీజేపీలో టీఆర్ఎస్ఎల్పీ విలీనం కాబోతోందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఫ్లోర్ లాగే బీజేపీలో టీఆర్ఎస్ఎల్పీ విలీనం అవుతుందని రేవంత్ వ్యాఖ్యానించారు. రాజ్యసభలో వున్న వాళ్లకు ఇప్పటికే నోటీసులు వచ్చాయని.. నలుగురు రాజ్యసభ ఎంపీలు విలీనానికి రెడీ అయ్యారని ఆయన బాంబు పేల్చారు. 

తెలంగాణలో టీఆర్ఎస్ - బీజేపీల మధ్యే పోరు వుందన్నట్లుగా మీడియాలో అపోహలు వ్యాపింపజేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ సంస్థలు వేట కుక్కల్లాగా తమ వెంటపడి వేధిస్తున్నాయని టీఆర్ఎస్ అంటోందని ఆయన గుర్తుచేశారు. ఢిల్లీ నుంచి వచ్చే ప్రతి బీజేపీ నేత చంద్రశేఖర్ రావు కుటుంబంపై అవినీతి ఆరోపణలు చేస్తూ.. జైలుకి పంపుతామని చెబుతున్నారని రేవంత్ దుయ్యబట్టారు. టీఆర్ఎస్- బీజేపీ మధ్య యుద్ధ వాతావరణం వున్నట్లుగా డ్రామాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్లీనరీ కోసం గులాబీ కూలి పేరిట వందలాది వ్యాపార సంస్థలను, వ్యక్తులను టీఆర్ఎస్ నేతలు వేధించారని రేవంత్ ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను అరెస్ట్ చేయాలంటూ తాను ఏసీబీ డీజీకి ఫిర్యాదు చేశానని ఆయన గుర్తుచేశారు. 

ALso REad:బంగారు కూలీ, గులాబీ కూలీల పేరుతో వందల కోట్లు వసూలు.. లెక్కలు చెప్పండి : టీఆర్ఎస్‌పై రేవంత్ ఆరోపణలు

కానీ కేంద్ర ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం.. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ రూ.20 వేలకి పైన చందాలను నగదు రూపంలో తీసుకోవడానికి వీల్లేదని, రూ.20 వేలకి పైన నగదును పార్టీ ఖర్చుల కింద ఖర్చు పెట్టడానికి లేదని రేవంత్ రెడ్డి తెలిపారు. పార్టీ ఖర్చులు, ఆదాయాలకు సంబంధించిన బ్యాలెన్స్ షీటును ప్రతి ఏడాది ఎన్నికల సంఘానికి సమర్పించాలని ఆయన వెల్లడించారు. ఈ క్రమంలో బంగారు కూలీ, గులాబీ కూలీ కింద ఖర్చు పెట్టిన వందల కోట్ల రూపాయలను టీఆర్ఎస్ పార్టీ చూపించలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?