హైదరాబాద్ లో కల్తీ పచ్చళ్ల ఫ్యాక్టరీ గుట్టు రట్టు

By rajesh yFirst Published Sep 12, 2018, 9:09 PM IST
Highlights

హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కల్తీ పచ్చళ్ల ఫ్యాక్టరీపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా కల్తీ నూనెతో పాచిపోయిన పదార్ధాలతో పచ్చళ్లు తయారు చేస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు.

హైదరాబాద్: హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కల్తీ పచ్చళ్ల ఫ్యాక్టరీపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా కల్తీ నూనెతో పాచిపోయిన పదార్ధాలతో పచ్చళ్లు తయారు చేస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. పచ్చళ్లు తయారు చేస్తున్న ఇస్మాయిల్ అనే ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.  
అపరిశుభ్ర వాతావరణంలో ఎటువంటి అనుమతులు లేకుండా పచ్చళ్లు తయారు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. 

మరోవైపు అప్పటికే తయారు చేసిన పచ్చళ్లు దుర్గంధం రావడంతో పోలీసులు ముక్కులు మూసుకుని విచారణ చెయ్యాల్సిన పరిస్థితి ఎదురైంది. పచ్చళ్లు, నూనెలు నిల్వ ఉంచిన డబ్బా విపరీతమైన వాసన వెదజల్లుతున్నాయి. 

పచ్చళ్లు తయారి ఫ్యాక్టరీపై ఫుడ్ సేఫ్టీ అధికారులు సైతం దాడులు నిర్వహించారు. అనుమతులు లేకుండా పచ్చళ్లు తయారు చెయ్యడం ప్రమాణాలు పాటించకపోవడంతో కేసులు నమోదు చేశారు. 80 డబ్బాల కల్తీ పచ్చళ్లు సీజ్ చేసిన పోలీసులు నిందితుడిని స్టేషన్ కు తరలించారు. 

click me!