జగ్గారెడ్డిపై మరో కేసు నమోదుకు రంగం సిద్ధం

By pratap reddyFirst Published 12, Sep 2018, 6:55 PM IST
Highlights

మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెసు నాయకుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డిపై మరో కేసు నమోదుకు రంగం సిద్ధమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.

సంగారెడ్డి: మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెసు నాయకుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డిపై మరో కేసు నమోదుకు రంగం సిద్ధమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తమ భూములను అక్రమించారని ఆరోపిస్తూ అమీన్‌పూర్ స్వాతంత్ర్య సమరయోధులకు చెందిన బాధితులు జాయింట్ కలెక్టర్, ఏఎస్పీ మహేందర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. 

స్వాతంత్య్ర సమరయోధులకు చెందిన 80 ఎకరాల భూమిని జగ్గారెడ్డి తమకు అమ్మి కోట్ల రూపాయలు తీసుకొని మోసం చేశాడని ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలని జాయింట్ కలెక్టర్‌ను వారు కోరారు. నకిలీ పత్రాలతో జగ్గారెడ్డి తమను తప్పుదోవ పట్టించారని బాధితులు చెప్పారు. 

జగ్గారెడ్డిని ఎన్నిసార్లు కలిసినా మమ్మల్ని పట్టించుకోలేదని వారున్నారు. దీనిపై పూర్తి విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

Last Updated 19, Sep 2018, 9:24 AM IST