రాజ్‌భవన్ ముట్టడి: పోలీసులతో దురుసుగా వ్యవహరించిన కాంగ్రెస్ నేతలపై కేసులకు చాన్స్

By narsimha lode  |  First Published Jun 16, 2022, 2:02 PM IST

రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు పోలీసుల పట్ల దురుసగుగా వ్యవహరించడంపై పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకొంది. దురుసుగా వ్యవహరించిన కాంగ్రెస్ నేతలపై పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉంది. 



హైదరాబాద్:  Rajbhavan  ముట్టడి కార్యక్రమంలో Telngana Congress పార్టీకి చెందిన కొందరు నేతలు దురుసుగా వ్యవహరించడాన్ని Police శాఖ సీరియస్ గా తీసుకొంది. పోలీసులపై కాంగ్రెస్ నేతలు వ్యవహరించిన తీరుపై పోలీస్ శాఖ కేసులు పెట్టే అవకాశం ఉందని సమాచారం.

న్యూఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోకి వచ్చిన  పోలీసులు తమ పార్టీ కార్యకర్తలు, నేతలపై పోలీసులు దాడి చేశారని ఎఐసీసీ నేత రణదీప్ సూర్జేవాలా చెప్పారు.  ఈ ఘటనను నిరసిస్తూ గురువారం నాడు దేశ వ్యాప్తంగా రాజ్ భవన్ల ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకొంది.  ఇవాళ చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని టీపీసీసీ సీరియస్ గా తీసుకుంది.  కాంగ్రెస్ పార్టీ చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పోలీసులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అయినా కూడా పోలీసుల భద్రతను చేధించుకొని కాంగ్రెస్ నేతలు కొందరు రాజ్ భవన్ వద్దకు చేరుకున్నారు. 

Latest Videos

undefined

also read:రాజ్ భవన్ ముట్టడికి కాంగ్రెస్ యత్నం, ఉద్రిక్తత: ఖైరతాబాద్‌లో బైక్ కు నిప్పు, బస్సు అద్దాలు ధ్వంసం

Khairatabad జంక్షన్ వద్ద  బైక్ కు కాంగ్రెస్ కార్యకర్తలు Bike కు నిప్పు పెట్టారు. TSRTC బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. బస్సుపై నిలబడి ఆందోళన చేశారు.  పోలీసుల అత్యుత్సాహం వల్లే ఈ పరిస్థితి నెలకొందని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు.  రాజ్ భవన్ పైపునకు వెళ్తునన CLP నేత Mallu Bhatti Vikramaka ను డీసీపీ Joyal Devis నేతృత్వంలో పోలీసులు అడ్డుకున్నారు. DCP సహా పోలీసులతో మల్లు బట్టి విక్రమార్క వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో డీసీపీ జోయల్ డేవిస్ ను భట్టి విక్రమార్క వెనక్కి నెట్టివేశారు. 

రాజ్ భవన్ వైపునకు వెళ్తున్న మాజీ కేంద్ర మంత్రి Renuka Chowdhuryని పోలీసులు అనుసరించారు. డోంట్ టచ్ మీ అంటూ రేణుకా చౌదరి పోలీసులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తాను రాజ్ భవన్ లోకి వెళ్తే యాక్షన్ తీసుకోవాలన్నారు. తాను కట్టిన పన్నులతో వేసిన రోడ్డుపై నడిస్తే మీకేం అభ్యంతరమని రేణుకా చౌదరి పోలీసులను ప్రశ్నించారు. ఓ మహిళా కార్యకర్తను పోలీసులు అరెస్ట్ చేసిన సమయంలో  ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగింది. ఈ విషయాన్ని గమనించిన రేణుకా చౌదరి పోలీసుల తీరుపై మండిపడ్డారు.  తనను అరెస్ట్ చేసేందుకు వచ్చిన మహిళా పోలీసులను నెట్టివేశారు మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి. అదే సమయంలో అక్కడే ఉన్న Panjagutta SI  రేణుకా చౌదరికి అడ్డుపడే ప్రయత్నం చేయడంతో రేణుకా చౌదరి ఎస్ఐ చొక్కా పట్టుకొని నిలదీశారు. ఈ పరిణామంతో అక్కడే ఉన్న మహిళా పోలీసులు కూడా షాక్ తిన్నారు. వెంటనే ఓ మహిళా పోలీస్ రేణుకా చౌదరి చేయిని పంజాగుట్ట ఎస్ఐ చొక్కా నుండి లాగివేశారు. రాజ్ భవన్ వైపునకు వెళ్తున్న రేణుకా చౌదరిని మహిళా పోలీసులు చుట్టుముట్టి పోలీస్ వాహనం వద్దకు తీసుకెళ్లారు. 

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి పోలీసు అధికారులపై వ్యవహరించిన తీరుపై పోలీసు శాఖ సీరియస్ గా తీసుకొంది.ఈ విషయమై కేసులు నమోదు చేసే అవకాశం ఉంది.  మరో వైపు రోడ్డుపై బైఠాయించిన  టీపీసీసీ చీఫ్ Revanth Reddy పై కూడా పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించే సమయంలో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు.జగ్గారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క,రేణుకా చౌదరిని పోలీసులు గోషామహల్ స్టేడియానాకి తరలించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

భారీగా ట్రాఫిక్ జామ్

రాజ్ భవన్ వైపునకు వెళ్లేందుకు ఖైరతాబాద్ జంక్షన్ వద్ద కాంగ్రెస్ ఆందోళన చేసింది. దీంతో ఖైరతాబాద్-పంజాగుట్ట మార్గంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.  బేగంపేట వైపు కూడా రోడ్డుపైనే వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.   కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
 

click me!